Most Recent

Tollywood : రూ.4000 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్ గర్ల్.. పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్..

Tollywood : రూ.4000 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్ గర్ల్.. పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్..

సాధారణంగా సోషల్ మీడియాలో సినీతారలకు సంబంధించిన ప్రతి విషయం తెగ వైరలవుతుంది. ముఖ్యంగా సెలబ్రెటీల పర్సనల్ విషయాలపై నెటిజన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. ఆ డ్యాన్సింగ్ క్వీన్ ఎవరో గుర్తుపట్టగలరా.. ? ఇప్పుడు ఆమె బాక్సాఫీస్ క్వీన్. వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. ఆమె నటించిన చిత్రాలు ఇప్పటివరకు రూ.4000 కోట్ల వరకు వసూలు రాబట్టాయి. తెలుగు, హిందీ భాషలలో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఆమె నటించిన చిత్రాలు ఇప్పుడు భారీగా వసూళ్లు సాధిస్తున్నాయి.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..? ఆమె మరెవరో కాదండి.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.

కర్ణాటకకు చెందిన రష్మిక.. 2016లో రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కిరిక్ పార్టీ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. ఇందులో రక్షిత్ శెట్టి హీరోగా నటించగా.. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో రష్మికకు తెలుగులో ఛాన్స్ వచ్చింది. ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. ఆ తర్వాత గీతా గోవిందం సినిమాతో తెలుగులో ఫస్ట్ హిట్టు ఖాతాలో వేసుకుంది. దీంతో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా ఆమె కెరీర్ మలుపు తిప్పింది. దీంతో అటు హిందీలోనూ ఆఫర్స్ అందుకుంది. గత కొన్నేళ్లుగా పాన్ ఇండియా లెవల్లో వరుస హిట్స్ అందుకుంటూ దూసుకుపోతుంది రష్మిక.

ఇవి కూడా చదవండి : Actress: కేకపెట్టిందిరోయ్.. గ్లామర్ ఫోజులతో సెగలు పుట్టించిన సీరియల్ బ్యూటీ.. హీటెక్కిస్తోన్న వయ్యారి..

ఇటీవలే పుష్ప 2, యానిమల్, ఛావా, కుబేర, థామా వంటి చిత్రాలతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు రానుంది. నవంబర్ 7న ఈ సినిమాను రిలీజ్ చేయనుండగా.. ప్రమోషన్లలో సందడి చేస్తుంది. రష్మిక నటించిన పుష్ప చిత్రం రూ.400 కోట్లు.. వరిసు రూ.300, యానిమల్ రూ.900 కోట్లు, పుష్ప 2 రూ.1800 కోట్లు వసులు చేశాయి. అలాగే ఛావా సినిమా రూ.800 కోట్లు వసూలు చేసింది. ఇదిలా ఉంటే.. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో రష్మిక ప్రేమలో ఉందనే వార్తలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం సైతం జరిగిందని టాక్. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ఇద్దరు స్పందించలేదు. విజయ్, రష్మిక కలిసి గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాల్లో నటించారు.

ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.