
ప్రస్తుతం ‘బిగ్ బాస్’ సీజన్ నడుస్తోంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ రియాలిటీ షోలు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి. తెలుగులో అయితే సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. అయితే ఈ మధ్యన బిగ్ బాస్ షోలు తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. తెలుగులో మాదిరిగానే ఇప్పుడు తమిళ్ బిగ్ బాస్ సీజన్ 9 జరుగుతోంది. ఈ రియాలిటీ షో ప్రారంభమై దాదాపు నెల రోజులు గడిచాయి. ప్రస్తుతం తమిళ్ బిగ్ బాస్ లో మొత్తం 20 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో 15 మంది మొదటి నుంచి ఉండగా, ఇటీవలే మరో నలుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ తో హౌస్ లోకి అడుగు పెట్టారు. ఈ మధ్యన తమిళ్ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ల గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి. హౌస్ మేట్స్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బిగ్ బాస్ తమిళ సీజన్ 9 ప్రస్తుతం 5వ వారం లో ఉంది. ఈ వారం నామినేషన్ ప్రక్రియ హోరా హోరీగా జరిగింది. వినోద్, వియానా, శబరి, విక్రమ్, పార్వతి, కమ్రుదిన్, ప్రవీణ్, కెమి, తుషార్, దివాకర్, రమ్య జో.. ఇలా ఈ వారం మొత్తం 12 మంది నామినేట్ అయ్యారు.
అయితే తమిళ్ బిగ్ బాస్ హౌస్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కంటెస్టెంట్లు పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు. దీనికి సంబంధించి రిలీజైన ప్రోమో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో కమ్రుదిన్, ప్రవీణ్ ల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. దేని గురించి తెలియదు కానీ ఒకరినొకరు పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు. మొదట మాటలతో ప్రారంభమైన ఈ వాగ్వాదం క్రమంగా ఒకరిపై ఒకరు అరుపులు, కేకలతో తారాస్థాయికి చేరుకుంది. కమ్రుదిన్ కోపంతో ప్రవీణ్ రాజ్ పైకి దూసుకెళ్లాడు. ఇతర కంటెస్టెంట్లు వీరిని ఆపడానిక ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కమ్రుదిన్, ప్రవీన్ ఒకరినొకరు నెట్టుకోవడం తోసుకోవడం ఈ ప్రోమోలో స్పష్టంగా కనిపించింది. మరి దీనిపై బిగ్ బాస్ ఎలా స్పందిస్తాడో చూడాలి. అలాగే హోస్ట్ గా వ్యవహరిస్తోన్న విజయ్ సేతుపతి దీనిపై ఎలా రియాక్టవుతారో చూడాలి.
వీడియో ఇదిగో..
#Day30 #Promo1 of #BiggBossTamil
Bigg Boss Tamil Season 9 – இன்று இரவு 9:30 மணிக்கு நம்ம விஜய் டிவில.. #BiggBossTamilSeason9 #OnnumePuriyala #BiggBossSeason9Tamil #BiggBoss9 #BiggBossSeason9 #VijaySethupathi #BiggBossTamil #BB9 #BiggBossSeason9 #VijayTV #VijayTelevision pic.twitter.com/jrFCHSPK8j
— Vijay Television (@vijaytelevision) November 4, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.