Most Recent

Mogalirekulu : ఎన్నాళ్లకు కనిపించిందిరోయ్.. మొగలి రేకులు సీరియల్ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడేలా ఉందంటే..

Mogalirekulu : ఎన్నాళ్లకు కనిపించిందిరోయ్.. మొగలి రేకులు సీరియల్ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడేలా ఉందంటే..

ఒకప్పుడు బుల్లితెర పై సంచలనం సృష్టించిన సీరియల్ మొగలి రేకులు. అప్పట్లో ఈ సీరియల్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఫ్యామిలీ అడియన్స్ నుంచి యూత్ వరకు సెపరేట్ అభిమానులు ఉండేవారు. అప్పట్లో సినిమాలకు మించిన క్రేజ్ ఉండేది. అలాగే ఇందులో నటించిన నటీనటులకు అడియన్స్ హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. స్మాల్ స్క్రిన్ పై సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన ఈ సీరియల్ కు మంజులా నాయుడు దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ సీరియల్ సాంగ్ సైతం సూపర్ హిట్. ఇందులో ఆర్కే నాయుడు, మున్నా పాత్రలకు హీరో రేంజ్ ఎలివేషన్ ఉండేది. ఈసీరియల్లో తండ్రికొడుకులుగా నటించిన సాగర్ మాత్రం టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ చేశాడు.

ఇవి కూడా చదవండి : Actress : అతడిని నమ్మి ఆ సీన్స్ చేశాను.. కానీ షూట్‌లో.. హీరోయిన్ కామెంట్స్..

మొగలి రేకులు సీరియల్లో ఈ రేంజ్ లో మాస్ ఎలివేషన్.. హీరోయిజం ఉన్న క్యారెక్టర్ ఏ సీరియల్ కు పడలేదు. దాదాపు 1350 ఎపిసోడ్స్ వరకు రికార్డ్ సృష్టించింది. ఇందులో హీరోయిన్ దేవి పాత్ర సైతం హైలెట్. ఈ పాత్రంలో అందం, అమాయకత్వంతో అలరించింది లిఖిత. ఆమె అసలు పేరు కంటే దేవి అనే పేరు మాత్రమే జనాలకు గుర్తుండి పోయింది. ఈ సీరియల్ మధ్యలోనే లిఖిత అనుహ్యంగా తప్పుకుంది. ఆ తర్వాత మరే సీరియల్ చేయలేదు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయ్యింది.

ఇవి కూడా చదవండి : Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. బ్రహ్మానందంపై అలాంటి మాటలా.. ?

పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైన లిఖిత.. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అంతగా యాక్టివ్ గా లేదు. కానీ ఆమెకు సంబంధించిన ఫోటోస్ మాత్రం నెట్టింట వైరలవుతున్నాయి. తాజాగా లిఖిత లేటేస్ట్ ఫోటోస్, ఫ్యామిలీ పిక్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

Likitha

Likitha

ఇవి కూడా చదవండి : Actor : ఒకప్పుడు మామిడి కాయలు అమ్మాడు.. ఇండస్ట్రీలోనే టాప్ నటుడు.. ఒక్కో సినిమాకు కోట్ల రెమ్యునరేషన్..

Mogali Rekulu Likitha

Mogali Rekulu Likitha

ఇవి కూడా చదవండి : Maheshwari : పెళ్లి సినిమా హీరోయిన్ గుర్తుందా.. ? ఆమె కూతురు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.