Most Recent

Malaika Arora: 51 ఏళ్లలోనూ 30 లుక్‌లో మలైకా.. ఫిట్‌నెస్ సీక్రెట్ రివీల్ చేసిన బ్యూటీ

Malaika Arora: 51 ఏళ్లలోనూ 30 లుక్‌లో మలైకా.. ఫిట్‌నెస్ సీక్రెట్ రివీల్ చేసిన బ్యూటీ

51 ఏళ్ల వయసులో మలైకా అరోరా ఇంకా బాలీవుడ్ హాటెస్ట్ ఫిట్‌నెస్ ఐకాన్! ఆ టోన్డ్ బాడీ, ఫ్లాట్ యాబ్స్, గ్లోయింగ్ స్కిన్ చూస్తే ‘ఏంటీ మాయ?’ అనిపిస్తుంది. యోగా, పిలేట్స్, వెయిట్ ట్రైనింగ్, స్ట్రిక్ట్ డైట్… ఇవన్నీ ఆమె రోజువారీ రొటీన్‌లో భాగమే! కానీ అసలు సీక్రెట్ ఏంటంటే డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, సెల్ఫ్ లవ్! రోజూ 6 గంటలకే లేచి వర్కౌట్, షుగర్-జంక్ ఫుడ్‌కి గుడ్‌బై, గ్రీన్ టీ-ప్రోటీన్ షేక్స్ హాయ్! మలైకా పంచుకున్న తన ఫిట్‌నెస్ సీక్రెట్స్ డైట్ టిప్స్, వర్కౌట్ రొటీన్ ఏంటో తెలుసుకుందాం..

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మలైకా తన ఫిట్‌నెస్ జర్నీని పంచుకుంది. ‘నాకు 40 దాటాకే నిజంగా యోగా, మైండ్‌ఫుల్ ఈటింగ్, కుకింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది’ అని చెప్పుకొచ్చింది. ఆ మాటల వెనుక ఒక బ్యూటిఫుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ స్టోరీ ఉంది. మలైకా చెప్పినట్టు, 30లలో ఆమెకు ఫిట్‌నెస్ అంటే కేవలం వర్కౌట్స్, డైటింగ్ మాత్రమే. కానీ 40 దాటాక శరీరం కంటే మనసు, భావోద్వేగాలు కూడా ఆరోగ్యంలో భాగమేనని ఆమె తెలుసుకుంది. అందుకే యోగా స్టార్ట్ చేసింది. రోజూ సూర్యనమస్కారాలు, ప్రాణాయామం, ఆసనాలు రొటీన్‌లో భాగం చేసుకుంది. ‘యోగా నాకు ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది, ఒత్తిడి తగ్గించింది, ఇన్నర్ పీస్ ఇచ్చింది’ అంటోంది మలైకా.

Malaika Arora

Malaika Arora

మైండ్‌ఫుల్ ఈటింగ్ & కుకింగ్ మలైకా పాటించే మరో అలవాటు. ఇంతకు ముందు డైట్ అంటే క్యాలరీలు కౌంట్ చేయడం, ఇష్టం లేకుండా తినడం. ఇప్పుడు ఆమె స్వయంగా వంట చేసుకుని, ప్లేట్‌లో రంగురంగుల కూరగాయలు, గింజలు, లీన్ ప్రోటీన్‌లతో బ్యాలెన్స్‌డ్ మీల్స్ తయారు చేసుకుంటుందట. ‘నేను వంట చేస్తున్నప్పుడు ఆ ఫుడ్‌తో కనెక్ట్ అవుతాను. అది నా శరీరానికి ఎలా మంచి చేస్తుందో ఫీల్ అవుతాను’ అంటోంది. 40 తర్వాత హార్మోన్ల మార్పులు, మెటబాలిజం స్లో అవడం సహజం. అయినా యోగా, మైండ్‌ఫుల్ ఈటింగ్‌తో శరీరాన్ని రీసెట్ చేయవచ్చు అనే విషయాన్ని మలైకా రుజువు చేసింది – వయసు కేవలం సంఖ్య మాత్రమే, లైఫ్‌స్టైల్ మారితే గ్లో మారుతుంది!


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.