Most Recent

‘వారానికి ఒక్కసారైనా ఏడుస్తా’ అంటూ సీక్రెట్ చెప్పేసిన యంగ్ బ్యూటీ.. కారణం ఏంటో?

‘వారానికి ఒక్కసారైనా ఏడుస్తా’ అంటూ సీక్రెట్ చెప్పేసిన యంగ్ బ్యూటీ.. కారణం ఏంటో?

ఈరోజుల్లో ఒత్తిడి సర్వసాధారణ విషయం. ఒత్తిడి తగ్గించుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని ఫాలో అవుతారు. యోగా, మెడిటేషన్, వాకింగ్, మ్యూజిక్… ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. సినీపరిశ్రమలోనూ షూటింగ్​లు, డేట్స్​, కథలు, జయాపజయాలు, అవకాశాలు.. ఇలా ఒత్తిడిని పెంచే అంశాలు ఎన్నో ఉన్నాయి. వాటి నుంచి బయట పడేందుకు నటీనటులు పలు పద్దతులను అవలంబిస్తారు.

కొందరు విదేశాలకు వెళ్తే, మరికొందరు ప్రకృతి ఒడిలో సేదదీరేందుకు మొగ్గు చూపుతారు. తాజాగా ఓ యంగ్​ బ్యూటీ తాను ఒత్తిడిని తగ్గించుకునే సీక్రెట్​ను పంచుకుని వార్తల్లో నిలిచింది. ‘వారానికి ఒక్కసారి కచ్చితంగా ఏడుస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఇంతకీ ఎవరు ఆ బ్యూటీ? ఎందుకు ఏడుస్తుంది?

ఆ యంగ్ బ్యూటీ పేరు అనీత్ పడ్డా! ‘సైయారా’ సినిమాతో హీరోయిన్‌గా డెబ్యూ చేసి, ఒక్క రిలీజ్‌తోనే కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ఆమె, ప్రస్తుతం ‘శక్తి శాలిని’తో మరో బ్లాక్‌బస్టర్ కోసం ఎదురుచూస్తోంది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన ఒత్తిడి మేనేజ్‌మెంట్ గురించి ఓపెన్‌గా మాట్లాడింది. ‘నేను చాలా సెన్సిటివ్‌గా ఉంటాను. ఏ విషయాన్నైనా డీప్‌గా ఆలోచిస్తాను. అందుకే వారానికి ఒక్కసారి కచ్చితంగా ఏడుస్తుంటాను’ అని చెప్పింది.

ఆ ఏడుపుకి కారణం ఏంటో కూడా చెప్పింది. తన ఫొటోలను ఎడిట్ చేసినప్పుడు ఏడుస్తుందట. ‘అభిమానులు నా రియల్ లుక్‌ను ఇష్టపడతారు కదా… ఎడిటింగ్ చూస్తే బాధగా ఉంటుంది’ అంటూ తన బాధని బయటపెట్టింది. ఈ వీడియో చూసిన అభిమానులు మాత్రం ‘ఎడిటింగ్​ ఏం అవసరం లేదు, నువ్వే పర్​ఫెక్ట్’ అంటూ ఓదారుస్తున్నారు.

Aneet Padda

Aneet Padda

అనీత్ పడ్డా జర్నీ చాలా హార్ట్​ టచింగ్​గా ఉంది! చిన్నప్పుడే సినిమాల్లో నటించాలని కలలు కనేదట. నటించాలనే ఆకాంక్షతో ఆడిషన్లు రికార్డ్ చేసేటప్పుడు తలుపులు మూసుకుని ప్రాక్టీస్ చేసేదట. పేరెంట్స్‌కు ‘హోమ్ వర్క్’ అని అబద్ధాలు చెప్పి రిహార్సల్ చేసేదట. ‘సైయారా’ సక్సెస్‌తో అనీత్​ జీవితం మారిపోయింది. ఇప్పుడు అమర్ కౌశిక్ దర్శకత్వంలో మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మితమయ్యే ‘శక్తి శాలిని’లో హీరోయిన్‌గా మెరుస్తోంది.

ఈ హారర్ బ్యాక్‌డ్రాప్​లో రూపొందుతున్న ఈ సినిమాలో మొదట కియారాను సెలెక్ట్ చేసినా, ఆమె తప్పుకోవడంతో అనీత్‌ను ఫైనల్ చేశారు. అవకాశాల కోసం ఎదురు చూడటం, రిజెక్షన్​ ఎదుర్కోవడం వంటి విషయాలు ఒత్తిడిని కలుగజేస్తాయని, దాన్ని తగ్గించుకునేందుకు ఏడవడమే తను ఎంచుకున్న మార్గం అంటోంది అనీత్​.. మరి మీరూ ఓసారి ట్రై చేసి చూస్తారా?


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.