
సినీప్రేక్షకులకు తమ అభిమాన నటీనటులకు ఏ ఆహారం ఇష్టమో తెలుసుకోవాలనే ఆరాటం ఎక్కువ. చాలామంది తమ అభిమాన నటీనటులకు ఇష్టమైన ఫుడ్ తినేందుకు ఇష్టపడతారు. అయితే ఫిట్‌నెస్ మెయింటేన్ చేస్తూ సైజ్ జీరో బాడీతో అలరించే హీరోయిన్ల డైట్ సీక్రెట్స్ తెలుసుకోవడం అంటే చాలామందికి ఆసక్తి. సెలబ్రిటీలు కూడా వారి డైట్ సీక్రెట్స్, స్కిన్‌కేర్ సీక్రెట్స్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ పంచుకున్న ఫేవరెట్ ఫుడ్ పోస్ట్ వైరల్‌గా మారింది.
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ అలియా తన ఫిట్‌నెస్, డైట్ సీక్రెట్స్‌తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. చాలా కఠినంగా డైట్ ఫాలో అవుతూ బాడీ ఫిట్‌నెస్ మెయింటేన్ చేస్తోంది అలియా. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్న అలియా ఆహారపు అలవాట్లు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి.
ఇటీవల తన ఫేవరెట్ ఫుడ్ ఏంటో చెప్పింది అలియా. ఇంతకీ ఈ బ్యూటీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలుసా.. ‘బీట్‌రూట్ దహి తడ్కా సలాడ్’. ఈ డిష్ గురించి చెబుతూ.. ‘ఇది నా ఫేవరెట్! బీట్‌రూట్ స్కిన్‌కి చాలా మంచిది. మరి దహి తడ్కా లేకుండా తినను, తడ్కాలో జీలకర్ర, పెరుగు, కరివేపాకు మన శరీరానికి చాలా మంచివి’ అని ట్వీట్ చేసింది అలియా.
View this post on Instagram
ఎలా చేయాలి..
అలియా పంచుకున్న ఈ సింపుల్ సలాడ్‌కి న్యూట్రిషనిస్ట్ దీపికా శర్మా కూడా థంబ్సప్ ఇచ్చారు. ‘ఇది స్కిన్, డైజెషన్, ఓవరాల్ హెల్త్‌కి పర్ఫెక్ట్ కాంబినేషన్’ అంటూ కామెంట్ చేశారు. అసలు ఈ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో, దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం! ముందుగా బీట్‌రూట్స్‌ను గ్రేట్ చేసి, పెరుగుతో మిక్స్ చేయాలి. తర్వాత పాన్‌లో తడ్కా రెడీ చేయాలి. కొంచెం నూనెలో ఆవాలు, జీలకర్ర వేసి, హింగ్, కరివేపాకు యాడ్ చేసి ఆపేయాలి. ఈ హాట్ తడ్కాను సలాడ్‌లో వేసి కలిపితే బీట్‌రూట్ దహి తడ్కా సలాడ్ రెడీ!
ప్రయోజనాలు..
ఈ డిష్ హెల్త్ బూస్టర్! బీట్‌రూట్ రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది, లివర్‌ని డిటాక్స్ చేస్తుంది. దీంట్లో ఉండే ఫైబర్ గట్ బ్యాక్టీరియాని సపోర్ట్ చేస్తుంది. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి, డైజెషన్‌కి హెల్ప్ చేస్తాయి. మరింత స్పెషల్‌గా, పెరుగు యొక్క లాక్టిక్ యాసిడ్ బీట్‌రూట్‌లోని ఐరన్‌ని బాడీ శోషణ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. మొత్తంగా ఈ డిష్ గట్ హెల్త్, లివర్ ఫంక్షన్, బ్లడ్ క్లీన్సింగ్, స్కిన్ గ్లో, ఎనర్జీ లెవల్స్‌ని బూస్ట్ చేస్తుంది. న్యూట్రిషనిస్ట్ దీపికా శర్మా చెప్పినట్లు అలియా లాంటి ఫిట్‌నెస్ కావాలంటే మీరూ ఓసారి ఈ డిష్ ట్రై చేసి చూడండి!