Most Recent

Bigg Boss 9 Telugu: అతడు నా బుజ్జి తమ్ముడు సార్.. పచ్చళ్ల పాప దెబ్బకు నోరెళ్లపెట్టిన నాగ్..

Bigg Boss 9 Telugu: అతడు నా బుజ్జి తమ్ముడు సార్.. పచ్చళ్ల పాప దెబ్బకు నోరెళ్లపెట్టిన నాగ్..

బిగ్‏బాస్ సీజన్ 9.. శనివారం వీకెండ్ ఎపిసోడ్ కోసం అడియన్స్ ఎంతగానో ఎదురుచూశారు. గతవారం వైల్డ్ కార్డ్స్ ఎంట్రీగా వచ్చిన ఆరుగురు హౌస్మేట్స్ చేసిన రచ్చతో విసుగొచ్చిన ప్రేక్షకులు ఈ వారం నాగార్జున వాళ్లకు ఎలాంటి క్లాస్ తీసుకుంటారో అని తెగ వెయిట్ చేశారు. ఇక అడియన్స్ ఊహించినట్లుగానే నాగార్జున ఒక్కొక్కరికి గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు ప్రోమోలతో తెగ హైప్ ఇచ్చేశారు. శనివారం ఉదయం నుంచి విడుదలైన ప్రోమోలలో వైల్డ్ కార్డ్స్ పొగరు దించేసిన నాగ్.. ఆ తర్వాత హౌస్ లో ఉన్న ప్రేమకథలు, బాండింగ్స్ పై కుండబద్దలు కొట్టారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో రమ్య దెబ్బకు నోరెళ్లబెట్టారు నాగార్జున. పవన్ నా బుజ్జి తమ్ముడు అంటూ రమ్య చెప్పడంతో హౌస్ మొత్తం షాకయ్యింది. మరి నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‏గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..

శుక్రవారం నాడు హౌస్ లో ఏం జరిగిందో చూపించారు నాగ్. దివ్య హడావిడిగా అందరికీ చపాతీలు చేస్తుంటే.. నాకు నేర్పించు అని అన్నది. ఇది టైమ్ కాదు అని అనడంతో విసిరేసినట్లుగా చేసుకో అని వెళ్లిపోయింది. ఇక కర్రీ వేసుకుంటుంటే గౌరవ్ ఇంకా తినలేదు అని డీమాన్ చెప్పడంతో చూసుకుని మాట్లాడాలి అంటూ నానా రచ్చ చేసింది. ఇక దివ్య చపాతి చేయడం నేర్పంచలేదని పెద్ద గొడవ చేసింది. కారణం లేకుండా గట్టి గట్టిగా అరుస్తూ నానా రభస చేసింది. ఇక చివరకు ఆయేషా వచ్చి దివ్యకు క్షమాపణ చెప్పింది. తర్వాత శనివారం ఎపిసోడ్ లో కెప్టెన్ సుమన్ శెట్టి పై ప్రశంసలు కురిపించారు నాగ్. ఇప్పటివరకు ఎవరూ చేయనిది చేస్తున్నావ్ .. శెభాష్ అంటూ మెచ్చుకున్నారు. ఇక తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో మాట్లాడారు. మొదట అయేషాతో మాట్లాడారు.

ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..

ఇక తర్వాత పచ్చళ్ల పాప రమ్యతో మాట్లాడగా.. హౌస్ చాలా బావుంది సార్ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో నాగార్జున.. బాగుందా.. ? లేదా బాగున్నాడా ? అంటూ నాగార్జున కౌంటరిచ్చారు. ఎవరు సార్ అంటూ గౌరవ్ వైపు చూసి.. మీరే బాగున్నారు అని చెప్పింది. దీంతో ఇటు తొయ్యొద్దు నువ్వు.. అక్కడున్న వాళ్ల గురించి నేను అడిగింది అంటూ మాదురిని లేపి అసలు విషయం చెప్పమన్నారు. దీంతో బాగున్నాడా అంటే పవన్ అని నవ్వాను సార్ అన్నది మాధురి. దీంతో పవన్ నా బుజ్జి తమ్ముడు సార్ అని రమ్య చెప్పడంతో దెబ్బకు అక్కడున్నవారంతా షాకయ్యారు. ఇక రమ్య మాటతో నోరెళ్లబెట్టారు నాగ్. ప్లేట్ తిప్పేస్తుంది సార్.. అంటూ మాధురి చెప్పడంతో నీనేం తిప్పడం లేదు సార్.. నాకు పవన్ తమ్ముడే అని అన్నది. దాంతో సంజన ఈ సీరియల్ కు మంచి టైటిల్ పెట్టొచ్చు సార్ అంటూ కౌంటరిచ్చింది. ఇక తర్వాత రమ్యను కూర్చొమ్మా అని అన్నారు నాగార్జున.

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‏తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.