
2010లో థియేటర్లలో విడుదలైన షాపింగ్ మాల్ సినిమా ఎంత పెద్ద హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. వసంత్ బాలన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో మంచి వసూల్లు రాబట్టింది. వస్త్ర కంపెనీలలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న వేధింపులు, వారి జీవితాలను ఈ సినిమా చూపించింది. ఇందులో మహేష్, అంజలి, పాండి, ఎ. వెంకటేష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ సంగీతం అందించగా.. ఈ సినిమాతోనే మహేష్, అంజలి హీరోహీరోయిన్లుగా పరిచయమయ్యారు. ఈ సినిమాతో అంజలికి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ వచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా హీరో మహేష్ గుర్తున్నాడా.. ?
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..
షాపింగ్ మాల్ సినిమా తర్వాత కొంజం సిరుపు కొంజం కోపం చిత్రంలో నటించారు. ఆ తర్వాత లాస్ బెంచ్ సినిమాతో మలయాళీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించిన అతడు.. స్టార్ డమ్ అందుకోలేకపోయాడు. కాలేజీ చదువును మధ్యలోనే మానేసి షాపింగ్ మాల్ సినిమా చేసిన మహేష్.. ఇప్పటికీ సరైన బ్రేక్ రాలేదు. ఇప్పుడు అతడు నటిస్తున్న లేటేస్ట్ మూవీ తడై అత్తడి ఓధి. ఈ సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది.
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..
ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రంలో మహేష్ లుక్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అయితే ఇప్పుడు అతడి లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్
Mahesh
ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?