
కన్నడ హీరో రిషబ్ శెట్టి తెరకెక్కించిన లేటేస్ట్ మూవీ కాంతార చాప్టర్ 1. ఇందులో రిషబ్ శెట్టితోపాటు రుక్మిణి వసంత్ సైతం కథానాయికగా నటించింది. 2022లో హిట్టైన కాంతార చిత్రానికి ప్రీక్వెల్ ఇది. విడుదలకు ముందే ట్రైలర్, టీజర్, పోస్టర్ ద్వారా అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో దూసుకుపోతుంది. మొదటి రోజే రూ.70 కోట్లకు పైగా వసూల్లు రాబట్టిన ఈ సినిమా.. తాజాగా రెండు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ఇప్పుడు మూడవ రోజు రూ.50 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా రూ.125 కోట్ల బడ్జెట్ ను తిరిగి పొందింది.
ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?
కాంతార చాప్టర్ 1 అక్టోబర్ 2న విడుదలైంది. కన్నడతోపాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం సహా ఐదు భాషలలో రిలీజ్ చేశారు. కాంతారా చాప్టర్ 1 రెండవ రోజు రూ.46 కోట్లు వసూలు చేసింది. మొదటి శనివారం (వారాంతం) ఈ సినిమా రూ.55 కోట్లు వసూలు చేసిందని సమాచారం. కాంతార చాప్టర్ 1 మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్ ఇప్పటివరకు రూ.162.85 కోట్లు వచ్చినట్లు టాక్. ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ.200 కోట్లు దాటే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..
కాంతార చాప్టర్ 1 చిత్రంలో రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ సినిమా థియేటర్లలో దూసుకుపోతుంది.
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..