
ప్రముఖ నటి రేణూ దేశాయ్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటోంది. 2023 లో టైగర్ నాగేశ్వర రావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ మరో సినిమాలో నటించలేదీ అందాల తార. అదే సమయంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీ బిజీగా ఉంటోంది. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, మూగజీవాల సమస్యల పట్ల తన గళాన్ని వినిపిస్తోంది. ఇందుకోసం ఒక స్వచ్ఛంద సేవా సంస్థ (NGO)ను కూడా ప్రారంభించింది. ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉండే రేణు పలు ఆసక్తికర విషయాలను అందులో పంచుకుంటుది. అలా తాజాగా ఆమె ఒక ఆసక్తికర వీడియోను షేర్ చేసింది. తాజాగా రేబీస్ టీకా తీసుకున్న రేణూ దేశాయ్ ఆ వీడియోను రికార్డ్ చేసి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. సాధారణంగా టీకాలు తీసుకున్నప్పుడు ఫొటోలు లేదా వీడియోలు రికార్డ్ చేయనన్న రేణు దేశాయ్.. ఈసారి మాత్రం అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ఇలా చేశానని ఆ వీడియోలో చెప్పుకొచ్చింది.
‘నేను రేబిస్ టీకా తీసుకుంటున్నప్పుడు రికార్డ్ చేయడం ఇదే మొదటిసారి. గతంలో ఏదైనా టీకా తీసుకున్నప్పుడు నేను ఫొటోలు లేదా వీడియోలు తీయాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ సమయానికి టీకా తీసుకోవడం ఎంత ముఖ్యమో తెలియజేయడానికి ఈసారి షేర్ చేయాలనిపించింది. జంతువులను పెంచుకునే వ్యక్తులు, పశువైద్యులు తప్పనిసరిగా టీకా రికార్డులు మెయింటైన్ చేసుకోవాలి. నిర్ణీత సమయానికి వ్యాక్సిన్లు తీసుకుంటున్నారో లేదో నిర్ధారించుకోవాలి’ అని రేణు దేశాయ్ సూచించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
రేబీస్ వ్యాక్సిన్ తీసుకుంటోన్న నటి రేణూ దేశాయ్.. వీడియో ఇదిగో..
View this post on Instagram
మరోవైపు రేణూ దేశాయ్ కుమారుడు అకీరా నందన్ కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టవచ్చుననే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతుంది. పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమాలో అకీరా ఒక కీలక పాత్ర చేశాడని రూమర్స్ కూడా వినిపించాయి. కానీ అదేమీ జరగలేదు. ఈ నేపథ్యంలో అకీరాను సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రేణూ దేశాయ్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..