
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా ఓజీ. సుజిత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా దసరా పండగ కానుకగా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. తద్వారా పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. స్టైలిష్ గ్యాంగ్ స్టర్ గా పవన్ కల్యాణ్ స్వాగ్, విలన్ గా ఇమ్రాన్ హష్మీ నటన, గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ సీక్వెన్స్, తమన్ బీజీఎమ్ ఓజీ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. కాగా ఇటీవలే ఈ సినిమా టికెట్లు తగ్గించారు. దీంతో మళ్లీ ఈ మూవీ కలెక్షన్లు ఊపందుకున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా రూ. 368 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. చాలా చోట్ల ఈ మూవీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఆడుతోంది. అయితే ఇంతలోనే ఓజీ ఓటీటీ రిలీజ్ గురించి సామాజిక మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. నెల రోజుల్లోనే ఓటీటీలో విడుదల అయ్యేలా ఆ సంస్థతో ఓజీ మేకర్స్ ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం అక్టోబర్ 23 నుంచి ఓజీ సినిమా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.
కాగా సెన్సార్ కారణంగా ఓజీ థియేట్రికల్ వెర్షన్ లో కొన్ని సీన్లకు కత్తెర పడింది. అయితే ఓటీటీ వర్షన్‌లో ఆ అదనపు సీన్లు యాడ్ చేస్తారని తెలుస్తోంది. అలాగే నేహా శెట్టి స్పెషల్ సాంగ్ కూడా ఉండనుందని తెలుస్తోది. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం రూమర్స్ మాత్రమే. ఓజీ ఓటీటీ రిలీజ్ పై ఇంకా అధికారిక ప్రకటన రావల్సి ఉంది. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఓజీ మూవీలో భారీ తారాగణమే ఉంది. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తే, బాలీవుడ్ హీరో ఇమ్రాన హష్మీ స్టైలిష్ విలన్ గా అదరగొట్టాడు. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, సుహాస్, ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, రావు రమేష్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, వెన్నెల కిశోర్, వెంకట్, బిగ్ బాస్ శుభశ్రీ రాయగురు ఇలా ఎందరో స్టార్స్ ఓజీలో వివిధ పాత్రల్లో మెరిశారు. తమన్ స్వరాలు అందించాడు.
అక్టోబర్ 23 నుంచి స్ట్రీమింగ్ కు ఛాన్స్..
#TheyCallHimOG OTT release:
According to reports, #OG is expected to start streaming on OTT from October 23, 2025.
The makers have locked a four-week deal with Netflix.
An official confirmation about the OTT release date is awaited. pic.twitter.com/B75r8gn2Hh
— MOHIT_R.C (@Mohit_RC_91) October 6, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.