Most Recent

Bigg Boss 9 Telugu: ఇమ్యునిటీ గెలిచిన ఇమ్మాన్యుయేల్.. నామినేషన్స్ నుంచి సేఫ్..

Bigg Boss 9 Telugu: ఇమ్యునిటీ గెలిచిన ఇమ్మాన్యుయేల్.. నామినేషన్స్ నుంచి సేఫ్..

బిగ్‌బాస్ సీజన్ 9 ఐదవ వారం కొనసాగుతుంది. గత వారం హౌస్ నుంచి మాస్క్ మ్యాన్ హరీష్ ఎలిమినేట్ అయ్యాడు. మొదటి శ్రష్టి వర్మ మినహా.. ఆ తర్వాత వరుసగా కామనర్స్ ఎలిమినేట్ అయ్యారు. దీంతో ఈవారం నామినేషన్స్ పై మరింత ఉత్కంఠ నెలకొంది. కెప్టెన్ రాము మినహా.. మిగిలిన అందరూ భరణి, సుమన్ శెట్టి, ఫ్లోరా, సంజన, ఇమ్మాన్యుయేల్, రీతూ చౌదరి, పవన్ కళ్యాణ్, శ్రీజ, తనూజ, నికితా నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటిస్తూ షాకిచ్చాడు. అయితే ఈ నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యేందుకు ఇమ్యూనిటీ గెలుచుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. అందుకు ఒక్కో టాస్కు ఇస్తున్నట్లు చెప్పాడు. ముందుగా బెడ్ పై అందరూ ఉంటారు. వారిలో ఒక్కొక్కరిని కిందకు తోసేయాల్సి ఉంటుంది. చివరకు మిగిలిన వాళ్లతో మరో గేమ్ ఆడించారు.

ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..

బెడ్ టాస్కులో ఫ్లోరా, రాము కెప్టెన్స్ కాగా.. మిగిలిన వారందరూ టాస్కులో పాల్గొనాల్సి ఉంటుందని చెప్పారు. టాస్కు మొదలుకాగానే ముందాగా అందరూ సంజనను కిందకు తోసేశారు. ఆ తర్వాత సుమన్ శెట్టిని కిందకు తోసేశారు. తర్వాత దివ్యను తోసేయగా.. చివరకు డీమాన్ పవన్, రీతూను నెట్టేశారు. చివరగా శ్రీజ ఎలిమినేట్ కాగా.. మిగిలిన నలుగురు కళ్యాణ్, భరణి, తనూజ, భరణికి ఇమ్యూనిటీ టాస్కు పెట్టారు.

ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

ఆ తర్వాత గాలి నిప్పు నీరు టాస్కు ఇవ్వగా.. అందులో గెలవాలంటే పోటీదారులు మొత్తం మూడు లెవల్స్ పూర్తి చేయాలి. మొదటి లెవల్లో పేపర్ ప్లెయిన్స్ ను స్ట్రాస్ సాయంతో ఎండ్ పాయింట్ వరకూ తీసుకెల్లి అక్కడున్న బ్రిక్స్ లో ఒకటి తీసుకుని రెండో లెవల్ కోసం గార్డెన్ ఏరియాకు రావాలి. ఒక విషయం గుర్తుంచుకోండి పోటీదారులు మొదటి లెవల్లో ఐదు ప్లెయిన్స్ ను చేరిస్తే సరిపోతుంది. రెండో లెవల్లో పాత్ వే మీద ఉన్న సుత్తిని తీసుకుని ఆ పాత్ వే మీదుగా నడుస్తూ దారిలో ఉన్న రెండు పాయింట్స్ దగ్గర ఆగి సుత్తితో ఫైర్ వచ్చేలా కొట్టి ఎండ్ బజర్ వరకు వెళ్లి మరో బ్రిక్ ను సేకరించాలి. ఇక చివరకు వాటర్ డ్రమ్ములో ఉన్న కార్క్ తీసి దానిలో ఉన్ననీరు ఫిష్ ట్యాంకులో పడేలా చేయాలి. ఫిష్ ట్యాంక్ ఉన్న బ్రిక్ రెడ్ లైన్ దాటి పైకి వచ్చిన తర్వాత ఆ బ్రిక్ ను తీసుకోవాలి. మూడు లెవల్లో బ్రిక్స్ ను చివరకు తమకు కేటాయించిన బ్యాలెన్సింగ్ స్టాండ్ పై ఉంచి వాటిని సరిగా బ్యాలెన్స్ చేసి మూడు సెకన్లు కౌంట్ చేసి బెల్ మోగించాలి. ఈ టాస్కులో అందరి కంటే ముందుగా ఇమ్మూ ఫినిష్ చేసి ఇమ్యూనిటీ పొంది నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.