Most Recent

ఇలా తయారేంటి అందరూ.. సైకోల్లా ఉన్నారు.. రగిలిపోయిన భరణి

ఇలా తయారేంటి అందరూ.. సైకోల్లా ఉన్నారు.. రగిలిపోయిన భరణి

బిగ్ బాస్ సీజన్ 9లో రచ్చ రచ్చ జరుగుతుంది. కొత్త కంటెస్టెంట్స్ వచ్చి పాత కంటెస్టెంట్స్ కు చుక్కలు చూస్తున్నారు.. నామినేషన్స్ లో రచ్చ రచ్చ చేస్తున్నారు వైల్డ్ కార్డులు ఎంట్రీలు.. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మాధురి భరణి పై రెచ్చిపోయింది. నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్స్ ప్రక్రియ మళ్లీ మొదలైంది. బిగ్ బాస్ హౌస్‌లోకి బాల్ వదిలాడు.. దాని కోసం కొత్తగా వచ్చిన వారు పోటీపడ్డారు. కిందపడి మీదపడి ఫైనల్ గా దువ్వాడ మాధురి చేతికి బాల్ వచ్చింది. ఆ బంతిని రీతూ కి ఇచ్చింది మాధురి.. దాంతో రీతూ భరణిని నామినేట్ చేసింది. మీరు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు.. నాకు మీరు సపోర్ట్ చేయలేదు అంటూ భరణిని నామినేట్ చేసింది రీతూ..

కెప్టెన్సీ టాస్క్ లో మీరు హెల్ప్ చేస్తానని మాట ఇచ్చి కూడా చేయలేదు.. మీ వల్లే నా కెప్టెన్సీ పోయింది.. మాట ఇస్తే నిలబెట్టుకోవాలి..అంటూ భరణిపై రెచ్చిపోయింది రీతూ.. దానికి భరణి సమాధానమిస్తూ.. నేను నీ ఒక్కదానికే మాట ఇవ్వలేదు.. ఇంకొంతమందికి కూడా మాట ఇచ్చా.. అలాగే రాముకి కూడా నేను మాట ఇచ్చా.. నువ్వు రాము ఉన్నప్పుడు నేను రాముకే హెల్ప్ చేస్తా అని చెప్పాడు భరణి.

ఆతర్వాత రెండో నామినేషన్ దివ్యకు వేసింది రీతూ. టిఫిన్ టైమ్‌కి దొరకలేదు అంటూ దివ్యను నామినేట్ చేసింది. నాకు చాలా ఇబ్బంది అయింది నీరసం వచ్చి కళ్లు తిరిగాయ్.. నువ్వు రేషన్ మానిటర్ కాబట్టి నీ వల్లే నాకు టిఫిన్ లేట్ అయిందని.. రీతూ సిల్లీ పాయింట్ చెప్పింది. దోస కోసం నన్ను నువ్వు నామినేట్ చేస్తున్నావా అని దివ్య అడిగింది. అది నాకు పెద్ద విషయం అంటూ రీతూ సమాధానం చెప్పింది. ఆ రెండు నామినేషన్స్ లో మాధురి ఒకరిని సేవ్ చేసి మరొకరిని నామినేట్ చేయాలి చేయాల్సి ఉంటుంది. దాంతో మాధురి.. నేను భరణిని సేవ్ చేస్తున్నాను దివ్యని నామినేట్ చేయాలనుకుంటున్నాను.. అంటూ చెప్పుకొచ్చింది. మేము కొత్తగా వచ్చాము.. మీరు మాకు కోఆపరేట్ చేయాలి.. మా మీద అరవకూడదు.. అని మాధురి చెప్పింది. అలాగే మీరు ఎంతసేపు భరణిగారితో తప్ప ఎవరితోనూ ఇంట్రాక్ట్ అవ్వలేదు..  అని మాధురి అనగానే..నాకు మీతో అవ్వాలని కూడా లేదు.. దివ్య చెప్పేసింది. సరే మీ ఇష్టం నేను చెప్తున్నాను మీ ఆన్సర్ నేను అడగలేదు కదా..ఇదిగో ఈ ఆటిట్యూడ్ కారణంగానే నామినేట్ చేస్తున్నాను.. అంటూ మాధురి వెళ్లి కూర్చుంది. ఆతర్వాత గ్యాప్ లో దివ్య-రాము-భరణి మాట్లాడుకున్నారు. ఇలా తయారేంటి అందరూ.. సైకోలు ఉంటారు చూడు.. చెప్తా.. నేను కొడితే దెబ్బ అదోలా ఉంటుందని జనాలకి తెలిసే టైమ్ వచ్చింది రాము..కొడతాను చూడరా ఇక్కడి నుంచి ఒక్కొక్కడినీ.. నువ్వు ఏం మాట్లాడకు సినిమా చూస్తూ ఉండు.. పిక్చర్ చూస్తూ ఉండు అంతే.. అంటూ భరణి రగిలిపోయాడు .

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.