
బిగ్ సీజన్‌లో నిన్నటి ఎపిసోడ్‌లో ఆడపిల్లల మధ్య రచ్చ జరిగింది.. అబ్బో వాళ్ల అరుపులు, కేకలతో హౌస్ మొత్తం దద్దరిల్లింది. నిన్నటి ఎపిసోడ్‌లో రీతూ-అయేషా మధ్య డిస్కషన్ జరిగింది. ఓ రేంజ్‌లో రీతూ-అయేషా మధ్య వాగ్వాదం జరిగింది. రీతూ చౌదరి దగ్గర డిమాన్ పవన్ కాస్త ఓవర్ యాక్షన్ చేశాడు. రీతూని ఉడికించాలని అయేషాతో పులిహోర కలిపాడు. గార్డెన్ ఏరియాలో అయేషాతో కలిసి డాన్స్ చేశాడు. అది కూడా ఓ రేంజ్ రొమాంటిక్ డాన్స్. దాంతో రీతూని ఏడిపిస్తూ ఇమ్మూ ఆటపట్టించాడు. వామ్మో మా పిల్లకి అన్యాయం చేసేశాడయ్యో నిద్రమబ్బోడు.. కొత్త పిల్ల రాగానే మా పిల్లని ఇలా వదిలేశాడు.. నీకేం పోయేకాలం వచ్చిందిరా.. అంటూ సరదాగా ఏడిపించాడు ఇమ్మూ.. దానికి రీతూ మరింత రగిలిపోయింది. డాన్స్ చేసిన తర్వాత కిచెన్‌లోకి వెళ్తూ వస్తావా రీతూ.? అని డీమాన్ అడిగాడు. లేదు నేను తర్వాత వస్తా అని రీతూ చెప్పింది. ఇంతలో ఏ మాకు సిగ్గుశరం లేవనుకుంటున్నావా.? ఇంత చూసి కూడా నీతో వస్తుందా.? అంటూ ఇమ్మూ రీతూని ఏడిపించాడు.
దాంతో రీతూ చౌదరి డీమాన్ పులిహోర కలపడం స్టార్ట్ చేశాడు.. రీతూ అలిగడంతో ఆమెను బిజ్జగించే పనిలో పడ్డాడు.. నువ్వు గేమ్ ఆడాలిరా.. కాన్సట్రేట్ చేయాలి కదరా.. అని రీతూ చెప్పింది. ఆతర్వాత రోజు ఉదయాన్నే.. గిన్నెలు కడగడానికి వెళ్లి రీతూకి పట్టరాని కోపం వచ్చింది. కళ్యాణ్ ను పిలిచి ఎవరైనా తినడం లేటయితే అర్ధరాత్రి తినేవాళ్లయితే తీసి పక్కన పెట్టుకోమని చెప్పు కళ్యాణ్.. పొద్దున్న నా వల్ల అవ్వదనే కదా నైట్ గిన్నెలు తోముతుంది.. మళ్లీ పొద్దున్న మళ్లీ గిన్నెలు వేస్తే ఎలా.. అంటూ రీతూ సీరియస్ అయ్యింది.
ఇదే విషయం దివ్యకి కూడా చెప్పింది. ఆతర్వాత మరో హౌస్‌మెట్ అయేషా దగ్గరకు వెళ్లి రీతూ రాత్రి అన్ని గిన్నెలు కడిగింది.. కానీ ఎవరో మార్నింగ్ దోశ పిండి గిన్నె అక్కడ పెట్టారు.. అది నువ్వు క్లిన్ చేస్తావా.? అని అడిగాడు. బ్రేక్‌ఫాస్ట్ నుంచి లంచ్ వరకూ వాడిన గిన్నెలు మాత్రమే నావి.. తర్వాత రీతూ పని అని చెప్పింది అయేషా.. ఆతర్వాత అయేషా కిచెన్‌లోకి వెళ్లింది. అక్కడ కడగని దోశ పిండి గిన్నె కనిపించింది. దాంతో ఇక్కడ బ్యాలెన్స్ పెట్టింది ఫినిష్ చేస్తావా.. ? అని మామూలుగానే అడిగింది. నేను క్లియర్‌గా కెప్టెన్‌కి చెప్పా.. అక్కడ నేను అన్నీ క్లియర్ చేశాను.. అక్కడ ఉన్నవి నేను క్లియర్ చేయను.. అని రీతూ చెప్పడంతో ఈ గిన్నె నిన్న నైట్‌ది అది.. అని అయేషా చెప్పింది. డ్యూటీ గురించి చెప్పినప్పుడు నువ్వే చెప్పావ్ నైట్ చేయకపోతే మార్నింగ్‌కి కూడా యాడ్ అవుతుందని.. ఇదే నేను చేస్తే నువ్వు ఒప్పుకుంటావా..? అని అయేషా గట్టిగా అడిగింది. రేషన్ మేనేజర్ ప్లీజ్ టాక్.. అంటూ దివ్య వైపు చూపించింది రీతూ. దాంతో ఇద్దరి మధ్యలో ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది. ఇది నిన్నటిది.. అంటే నీ డ్యూటీ కూడా నేనే చేయాలా..? అన్నీ నేనే తోమాలా..? అని అయేషా అడిగింది. అది నిన్నటిదే నేను చెప్పేది విను అయేషా.. అని రీతూ సీరియస్ అయ్యింది. దీంతో ఏం వినాలి చెప్పు.. అంటూ అయేషా కూడా రెచ్చిపోయింది. ఇద్దరి మధ్య ఓ రేంజ్ లో గొడవ జరిగింది. మధ్యలో కళ్యాణ్ దూరాడు.. కానీ ఇద్దరు అమ్మాయిలు ఎక్కడా ఆగలేదు.. మధ్యలో వచ్చిన కళ్యాణ్ కు కూడా అయేషా ఇచ్చిపడేసింది. దుకు నువ్వు నాతో వాదిస్తున్నావ్.. నేనేం తప్పు చేశాను ఇప్పుడు.. ఇక్కడ ఇది ఖాళీ చెయ్ నాకు స్పేస్ కావాలని చెప్పా అంతే.. అది తర్వాత చేస్తానని చెప్తే అయిపోయేది కదా.. కానీ కెప్టెన్‌ని అడుగు.. రేషన్ మేనేజర్‌ని అడుగు అంటే నేనేం చెయ్యాలి చెప్పు.. అని అయేషా కళ్యాణ్ పై అరిచింది. నీ పని నువ్వు చేయకపోతేనే కదా నేను అడుగుతున్నాను.. ఊరికే నేనేం నీ గురించి చెప్పలేదు రీతూ.. ఫస్ట్ నువ్వు కరెక్ట్‌గా ఉండు రీతూ..రీతూ కూడా చాలా వరకు రెచ్చిపోయింది కానీ అయేషా దెబ్బకు రీతూ తేలిపోయింది. నువ్వు ఉండవే ఫస్ట్.. నువ్వు ఉండు.. నువ్వు ఊరుకోవే.. నువ్వు ఊరుకో.. ఏం పని చేయవు అడిగితే న్యన్యన్య అంటావ్.. అంటూ అయేషా వెక్కిరించింది. రీతూ కూడా అరిచింది కానీ లాభం లేకుండా పోయింది. ఫైనల్ గా అయేషా ఓ రేంజ్ లో ఇచ్చిపడేసింది.