
సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఎప్పుడొచ్చాయో.. ఎప్పుడు వెళ్ళాయో చెప్పలేం.. ల్యాబ్ నుంచి బయటకు రాని సినిమాలు కూడా చాలానే ఉంటాయి. మరికొన్ని సినిమాలు షూటింగ్ దశలోనే ఆగిపోయిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. తాజాగా ఓ హీరోయిన్, హీరోకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఈ వీడియోలో ఉన్న హీరోయిన్, హీరో ఎవరో గుర్తువుపట్టరా..? ఈ వీడియో చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇదెప్పుడు తీశారు అంటూ అవాక్ అవుతున్నారు. ఇంతకూ ఈ వైరల్ వీడియోలో ఉన్న హీరో, హీరోయిన్ ను కనిపెట్టరా.? అందులో ఉన్న హీరోయిన్ సినిమాల్లో నటిస్తుంటే నిర్మాతగానూ రాణిస్తుంది. అలాగే హీరో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. యూత్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. వారు ఎవరంటే..
పై ఫొటోలో ఉన్న హీరో, హీరోయిన్ ఎవరో కాదు. యంగ్ హీరో విశ్వక్ సేన్, మెగా డాటర్ నిహారిక. యంగ్ హీరో విశ్వక్ సేన్ ఈనగరానికి ఏమైంది అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఫంకీ అనే సినిమా చేస్తున్నాడు. అనుదీప్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలియాల్సిందే.. ఒక మనసు అనే సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఆతర్వాత పలు సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడు నిర్మాతగా మారి సినిమాలు చేస్తుంది. కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా నిర్మించి మంచి విజయాన్ని అందుకుంది నిహారిక. ఇదిలా ఉంటే విశ్వక్ సేన్, నిహారిక కు సంబంధించిన పాత వీడియో వైరల్ అవుతుంది. నిహారిక విశ్వక్ సేన్‌కు గిలిగింతలు పెట్టడం, ఆయన సిగ్గుపడుతూ చిరునవ్వులు చిందించడం ఈ వీడియోలో మనం చూడొచ్చు. ఈ వీడియోపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇది విడుదల కానీ సినిమాలోని ఓ సీన్ అని , లేదు షార్ట్ ఫిలింలోనిది అని కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి