Most Recent

అయ్యగారికి హీరోయిన్ దొరికేసింది..! శ్రీలీల ప్లేస్‌లోకి ఊహించని ముద్దుగుమ్మ..

అయ్యగారికి హీరోయిన్ దొరికేసింది..! శ్రీలీల ప్లేస్‌లోకి ఊహించని ముద్దుగుమ్మ..

అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన యంగ్ హీరో, హాలీవుడ్‌ హీరోలను తలదన్నే హ్యాండ్సమ్.. ఇవన్నీ ఉన్నా.. అఖిల్‌కు ఇప్పటి వరకు ఒక్క సాలిడ్‌ హిట్‌ పడలేదని చెప్పాలి. మొన్నామధ్య వచ్చిన  మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ పర్లేదు అనిపించినా మిగతా సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద పరాజాయాన్ని మూటగట్టుకున్నాయి. ఇక ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఏజెంట్‌ కూడా డిజాస్టర్‌ కావడం అఖిల్‌ అభిమానులను నిరాశకు గురి చేసింది. ఎం మొదటి సినిమా మొదలుకొని ఒక్కటంటే ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకోలేదు. అఖిల్ తో చేసిన దర్శకులు కూడా ఆషామాషీ వ్యక్తులు కాదు. టాలీవుడ్ లో పేరున్న దర్శకులతో అఖిల్ సినిమాలు చేశాడు. కానీ హిట్ మాత్రం మనోడికి అందని ద్రాక్షలా మారింది.

చివరిగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఏజెంట్ సినిమా దారుణంగా డిజాస్టర్ అయ్యింది. దీంతో అఖిల్‌ తర్వాతి ప్రాజెక్ట్‌ ఏంటన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈసారైనా అఖిల్‌ హిట్‌ కొడతాడా.? అన్న క్యూరియాసిటీ పెరిగింది. అందుకే కాస్త గ్యాప్‌ తీసుకున్నా పర్లేదు కానీ సాలిడ్‌ హిట్‌తో ఇండస్ట్రీని షేక్ చేయాలని అఖిల్‌ డిసైడ్‌ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఓ సినిమా లైనప్ చేశాడు. ఈ సినిమాకు లెనిన్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. లెనిన్ సినిమాకు మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో కిరణ్ అబ్బవరం నటించిన వినరో భాగ్యం విష్ణు సినిమాకు దర్శకత్వం వహించాడు మురళీ.. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి శ్రీలీల తప్పుకుందని తెలుస్తుంది.

దాంతో ఇప్పుడు ఆమె ప్లేస్ లోకి ఎవరిని తీసుకుంటున్నారా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్. ఆమె ఎవరో కాదు భాగ్యశ్రీ బోర్సే . మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. భారీ అంచనాలు మధ్య విడుదలైన ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఆతర్వాత విజయ్ దేవరకొండతో కింగ్ డమ్ అనే సినిమా చేసింది. ఆ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఇప్పుడు రామ్ పోతినేనితో కలిసి ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా చేస్తుంది. ఇప్పుడు అఖిల్ సినిమాలో ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.