
బిగ్ బాస్ హౌస్ లో నిన్నటి ఎపిసోడ్ లో అనుకున్నదే అయ్యింది. కామనర్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన హరిత హరీష్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. గత మూడు వారాల్లో శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియ శెట్టి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. ఇక ఈ వారం హరిత హరీష్ కు తక్కువ ఓట్లు పడటంతో హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. గతవారం ఫ్లోరా సైని, రీతూ చౌదరి, సంజన, శ్రీజ, దివ్య, హరీష్ నామినేషన్‌లో ఉన్నారు.. వీరిలో శ్రీజ, హరీష్ కు తక్కువ ఓట్లు పడ్డాయి. కాగా చాలా తక్కువ ఓట్ల వ్యవధిలో హరీష్ ఎలిమినేట్ అయ్యాడు. హరీష్ ఎలిమినేట్ అని నాగ్ అనౌన్స్ చేసిన తర్వాత అతను ఎక్కడా ఎమోషనల్ అవ్వలేదు.. హరీష్ ఎక్కడా ఎమోషనల్ కాకుండా ఓకే సార్ అన్నాడు.
ఇది కూడా చదవండి :ఈ ఫొటోలో ఉన్న అన్న చెల్లెల్లు.. ఇప్పుడు టాలీవుడ్ హీరో, హీరోయిన్స్.. ఎవరో తెలుసా.?
ఇక స్టేజ్ పైకి వచ్చిన హరీష్ కు నాగార్జున చిన్న టాస్క్ ఇచ్చారు. ఈ హౌస్‌లో ఎవరు బ్లాక్ మాస్క్ పెట్టుకొని ఉన్నారు అని అడిగాడు. దానికి ముందుగా బ్లాక్ మాస్క్ మీద భరణి ఫొటో పెట్టాడు హరీష్. భరణి అందరితో మంచిగా ఉన్నట్లుగా నటిస్తారు.. ఆయన ట్రూ సైడ్ నేను చూశాను సార్..అందుకే నేను ఆయనతో ఆ దూరం మెయింటైన్ చేస్తూ ఉన్నాను. అని చెప్పాడు. ఆ తర్వాత ఇమ్మానుయేల్ ఫొటోను బ్లాక్ మాస్క్ మీద పెట్టాడు హరీష్. అందరితో ఫ్రెండ్లీగా ఉందాం అన్నట్లు ఉంటారు ఆయన నిజ స్వరూపం ఇంకా బయటికి చూపించలేదని నాకు అనిపిస్తుంది అని అన్నాడు హరీష్.. డీమాన్ పవన్‌కి కూడా బ్లాక్ మాస్క్ ఇచ్చాడు హరీష్. డిమాన్ నెమ్మదిగా మాట్లాడే వ్యక్తి సార్.. కానీ తనలో సత్తా చాలా ఉంది.. ఇప్పటివరకూ చూడలేదు..
ఇది కూడా చదవండి :ఒకే ఒక్క డిజాస్టర్ పడింది..! దెబ్బకు ఏడాదికి పైగా కనిపించకుండా పోయింది..
వైట్ మాస్క్‌లో మొదటిగా శ్రీజ ఫొటో పెట్టాడు. ఆమెకి కాస్త తొందరెక్కువ.. 10 సెకన్లు ఫాస్ట్.. ముందుగా ఉంటుంది.. కొన్నిసార్లు తను పెట్టే పాయింట్స్ చాలా బావుంటాయి.. బుల్లెట్స్ లాంటి పాయింట్స్ పెడుతుంది అంటూ శ్రీజను తెగ పొగిడేశాడు హరీష్. ఆ తర్వాత కళ్యాణ్‌కి వైట్ మాస్క్ ఇచ్చాడు. తను తనలా ఉన్నారని నేను నమ్ముతున్నా.. కానీ కొంచెం ఆ రిలేషన్స్ వాటి నుంచి బయటికొచ్చెస్తే మీరు ఇంకా బాగా ఆడగలరు అని కళ్యాణ్ కు సలహా ఇచ్చాడు హరీష్. చివరిగా వైట్ మాస్క్‌పై తనూజ ఫొటో పెట్టాడు హరీష్. నాలో ఎంతో కొంత నేను తనూజని చూసుకుంటా సార్.. బేసికల్‌గా మా ఇద్దరి ఫేస్ సీరియస్‌గా ఉన్నట్లు ఉంటుంది కొన్ని సందర్భాల్లో కానీ మనసులో ఏం ఉండదు.. కొంత షార్ట్ టెంపర్ ఎక్కువ ముక్కు మీద కోపం.. అందుకే అసహనం, చిరాకు కనబడుతుంటుంది.. తను మాస్క్ పెట్టుకున్నట్లు నాకు అయితే అనిపించలేదు అని చెప్పుకొచ్చాడు.
ఇది కూడా చదవండి : బుర్రపాడు సిరీస్ బ్రో.. సీన్ సీన్‌కు ఊహించని ట్విస్ట్ లు.. ఎక్కడ చూడొచ్చంటే
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..