
కొన్ని సార్లు నటీ నటులు తమ వయసుకు మించిన పాత్రలు చేయాల్సి వస్తుంది. నటనకు ప్రాధాన్యత ఉంటే తప్పకుండా ఆపాత్రలు చేయడానికి వెనకడుగేయారు. ఇలా చాలా మంది చిన్న వయసులోనే తల్లి పాత్రలు చేసిన వారు ఉన్నారు. ఇక ఇటీవల వచ్చిన కాంతార సినిమా సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన అన్ని భాషల్లో కాంతార బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. క్లైమాక్స్ లో 20 నిముషాలు ప్రేక్షకులను సీట్ అంచున కూర్చోపెడుతుంది. ఇదిలా ఉంటే ఇటీవలే కాంతార: చాప్టర్ 1 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా పై సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో రిషబ్ శెట్టి నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే కాంతార సినిమాలో హీరో రిషబ్ శెట్టి తల్లిగా నటించిన నటి గుర్తుందా.? ఎవరో తెలుసా..? ఆమె బయట ఎలా ఉంటుందో తెలిస్తే షాక్ అవుతారు.
ఇది కూడా చదవండి :ఈ ఫొటోలో ఉన్న అన్న చెల్లెల్లు.. ఇప్పుడు టాలీవుడ్ హీరో, హీరోయిన్స్.. ఎవరో తెలుసా.?
ఆమె పేరు మానసి సుధీర్ . కాంతార సినిమాలో హీరో తల్లి కమల అనే పాత్రలో నటించింది. సినిమాలో ఆమె చాలా వయసున్న పాత్రలో నటించింది కానీ బయట చాలా యంగ్. సినిమా ఈమె నటనను చూసి అంతా ఈమెను సీనియర్ నటి అని కూడా అనుకుంటున్నారు. కానీ కాదు. ఆమె టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఉండేది.
ఇది కూడా చదవండి :ఒకే ఒక్క డిజాస్టర్ పడింది..! దెబ్బకు ఏడాదికి పైగా కనిపించకుండా పోయింది..
కరోనా సమయంలో ఆమె చేసిన టిక్ టాక్ వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. ఆ వీడియోలు చూసే ఆమెను ఈ సినిమా కోసం సెలక్ట్ చేసుకున్నారు. మానసి సుధీర్ వయసు 35 ఏళ్ళు. కానీ కాంతార సినిమాలో 39ఏళ్ల వయసున్న రిషబ్ శెట్టికి ఆమె తల్లిగా నటించింది. ఇక కాంతార సినిమా తర్వాత మానసి సుధీర్ కు వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి. కాగా మానసి సుధీర్ బ్యూటిఫుల్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి : బుర్రపాడు సిరీస్ బ్రో.. సీన్ సీన్‌కు ఊహించని ట్విస్ట్ లు.. ఎక్కడ చూడొచ్చంటే
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.