Most Recent

Actor: 700 కోట్ల హిట్ సినిమా.. లగ్జరీ లైఫ్ వదిలి పల్లెటూరికి షిఫ్ట్ అయిన హీరో.. ఎందుకంటే..

Actor: 700 కోట్ల హిట్ సినిమా.. లగ్జరీ లైఫ్ వదిలి పల్లెటూరికి షిఫ్ట్ అయిన హీరో.. ఎందుకంటే..

సినీరంగుల ప్రపంచంలో ఇప్పుడు అతడి పేరు మారుమోగుతుంది. ఎలాంటి గాడ్ ఫాదర్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సహాయ దర్శకుడిగా పలు సినిమాలకు పనిచేశారు. ఆ తర్వాత దర్శకుడిగా సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. ఇప్పుడు నటుడిగానూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. ఆయన తెరకెక్కించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాయి. దీంతో ఎక్కడ చూసి ఆయన పేరే వినిపిస్తుంది. ఇదిలా ఉంటే.. స్టార్ డమ్ వచ్చాక చాలా మంది హీరోలు పెద్ద ఇళ్లు తీసుకుని లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ కొందరు తమ మూలాలను ఎప్పటికీ మర్చిపోరు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరో స్టార్ డమ్ వచ్చినప్పటికీ తన కుటుంబంతో కలిసి తన సొంతూరికి షిఫ్ట్ అయ్యారు. ఆయన మరెవరో కాదు.. కాంతార సిరీస్ ఫేమ్ రిషబ్ శెట్టి. ఆయన తెరకెక్కించిన కాంతార సిరీస్ మూవీస్ ఇప్పటివరకు రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి.

ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..

ప్రస్తుతం కాంతార సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు రిషబ్ శెట్టి. దసరా కానుకగా విడుదలైన కాంతార చాప్టర్ 1 భారీ వసూళ్లు రాబడుతుంది. అయితే ఇప్పుడు లగ్జరీ లైఫ్ వదిలి తన సొంత గ్రామానికి షిఫ్ట్ అయ్యాడు. ఇందుకు కారణాన్ని ఇటీవల వివరించారు. కాంతార ప్రీక్వెల్ కోసం దాదాపు మూడేళ్లు వర్క్ చేశారు రిషబ్ శెట్టి. బెంగుళూరు సిటీలో ఉంటే ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి వస్తుందని భావించారు. ఇప్పుడు తన భార్య, పిల్లల కోసం తన నేటివ్ ప్లేస్ అయిన కుందాపురంలోని ఒక కోస్టల్ విలేజ్ కు షిఫ్ట్ అయ్యారు. అందుకు కారణం తన పిల్లల చదువు కూడా.

ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్‏లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..

తన పిల్లలకు తన సొంత గ్రామంలోని స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నానని..సినిమా షూటింగ్ కోసం తాను ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబానికి దూరంగా ఉండలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తన రైటింగ్, టెక్నీషియన్, ప్రొడ్యూసింగ్ టీంస్ సైతం కుందాపురంకు తీసుకువచ్చినట్లు తెలిపాుర. దాదాపు ఐదేళ్లుగా తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంతా కాంతార ప్రపంచంలోనే జీవిస్తున్నామని.. ఇప్పుడు తన సొంత ఊరికి షిప్ట్ అవుతున్నామని అన్నారు. దీంతో రిషభ్ శెట్టి సింపుల్ లైఫ్ స్టైల్ ఆలోచన చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..

 

View this post on Instagram

 

A post shared by Hombale Films (@hombalefilms)

ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.