Most Recent

నాగార్జున, చిరంజీవి ప్రియురాలిగా.. నాగచైతన్యకు కోడలిగా.. 43 ఏళ్ల వయసులో అందం తగ్గని హీరోయిన్..

నాగార్జున, చిరంజీవి ప్రియురాలిగా.. నాగచైతన్యకు కోడలిగా.. 43 ఏళ్ల వయసులో అందం తగ్గని హీరోయిన్..

నటనా ప్రపంచంలో చాలా మంది హీరోయిన్స్ ఒకే హీరోతో అనేక చిత్రాల్లో నటిస్తారు. ప్రేక్షకులకు సైతం కొన్ని కాంబోలు ఎక్కువగా నచ్చేస్తాయి. తమకు నచ్చిన జంటను స్క్రీన్ పై చూసేందుకు ఇష్టపడుతుంటారు. కానీ మీకు తెలుసా.. ? నాగార్జున, చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణకు ప్రియురాలిగా నటించి.. తర్వాత నాగచైతన్యకు కోడలిగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? ప్రస్తుతం ఆమె వయసు 43 సంవత్సరాలు. ఇప్పటికీ ఏమాత్రం తగ్గని అందం ఆగం చేస్తుంది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. హిందీ, తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటుంది. అంతేకాదు.. 43 ఏళ్ల వయసులో పాతికేళ్ల అమ్మాయిల ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ కుర్ర భామలకు షాకిస్తుంది ఈ వయ్యారి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ హీరోయిన్ శ్రియ..

ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..

సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని హీరోయిన్. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. ఒకప్పుడు అందం, అభినయంతో ఇండస్ట్రీని ఏలేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం 43 ఏళ్ల వయసులో గ్లామర్ లుక్స్ తో నెట్టింట అరాచకం సృష్టిస్తుంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. కట్ చేస్తే.. ఇప్పుడు రామ్ చరణ్ తల్లిగా, నాగచైతన్యకు కోడలిగా కనిపించింది. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది.

ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్‏లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..

అయితే నాగార్జున సరసన నేనున్నాను.. చిరంజీవితో ఠాగూర్ చిత్రాల్లో నటించింది. పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న శ్రియా.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది. నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన మనం సినిమాలోనూ కీలకపాత్ర పోషించింది. ఇందులో నాగార్జున భార్యగా కనిపించింది. కానీ ఇందులో నాగచైతన్య కొడుకుగా నాగార్జున కనిపించాడు. అంటే.. మనం సినిమాలో చైతన్యకు కోడలిగా పాత్రలో శ్రియా కనిపించింది.ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంది ఈ అమ్మడు.

ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109)

ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.