Most Recent

కాంతార2కు బ్లాక్ బస్టర్ టాక్.. రిషబ్‌శెట్టిని కౌగలించుకుని ఏడ్చేసిన భార్య

కాంతార2కు బ్లాక్ బస్టర్ టాక్.. రిషబ్‌శెట్టిని కౌగలించుకుని ఏడ్చేసిన భార్య

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించిన లేటెస్ట్ మూవీ కాంతార 2.. ఇటీవలే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో వచ్చిన కాంతార సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక కాంతార 2 సినిమాను  ‘హోంబాలే ఫిల్మ్స్’ బ్యానర్ పై నిర్మాత విజయ్ కిరగందురు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ టెక్నీషియన్లు పని చేశారు.. ఈ సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వంతో పాటు నటించి మెప్పించాడు. కాంతారా ఛాప్టర్ 1 గురువారం (అక్టోబర్ 02) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.
సుమారు మూడేళ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై సంచలన విజయం సాధించిన కాంతార సినిమాకు ప్రీక్వెల్ ఇది.

కాంతార పార్ట్ 1 కేవలం రూ.15-20 కోట‍్లతో నిర్మిస్తే ఏకంగా రూ.400 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. అయితే ఇప్పుడు కాంతార ఛాప్టర్ 1 కోసం భారీగా బడ్జెట్ వెచ్చించారు. ఈ మూవీ కోసం ఏకంగా రూ.125 కోట్ల వరకు నిర్మాతలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా విడుదల తర్వాత రిషబ్ శెట్టి సతీమణి ఎమోషనల్ అయ్యారు. బెంగళూరులో బుధవారం ఈ సినిమా ప్రీమియర్ షోకు భార్య ప్రగతి శెట్టితో సహా రిషబ్‌శెట్టి హాజరయ్యారు. షో ముగియగానే భార్య ప్రగతి శెట్టి కన్నీళ్లతో వెనుక నుండి వచ్చి రిషబ్ శెట్టిని కౌగిలించుకుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో రిషబ్ ప్రమాదానికి గురవడంతో ఆమె రోజూ పూజలు చేసేది. సినిమా అద్భుతంగా తెరకెక్కడంతో ఆమె భావోద్వేగానికి గురైంది. ప్రగతి శెట్టి కాంతార సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించారు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.