Most Recent

Suhas: శుభవార్త చెప్పిన సుహాస్.. రెండోసారి తండ్రైన టాలీవుడ్ హీరో.. ఫొటోస్ వైరల్

Suhas: శుభవార్త చెప్పిన సుహాస్.. రెండోసారి తండ్రైన టాలీవుడ్ హీరో.. ఫొటోస్ వైరల్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సుహాస్ గుడ్ న్యూస్ చెప్పాడు. తాను రెండోసారి తండ్రైనట్లు వెల్లడించాడు. భార్య లలిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ మేరకు ఆస్పత్రిలో భార్య, బిడ్డతో కలిసున్న ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు సుహాస్. ‘ఇట్స్ బాయ్ అగైన్’ అని క్రేజీ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం సుహాస్ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సుహాస్-లలిత దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ దంపతులకు ఇప్పటికే ఒక కుమారుడు ఉన్నాడు. గతేడాది జనవరిలో సుహాస్ భార్య లలిత మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు మరోసారి వీళ్లకు కొడుకు పుట్టాడు. దీంతో సుహాస్ దంపతుల ఆనందానికి అవధుల్లేవు. సుహాస్‌-లలితలది ప్రేమ వివాహం. ఏడేళ్లు పాటు ప్రేమించుకున్నారు కానీ పెద్దలు నో చెప్పేసరికి 2017లో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. లలిత. ఇప్పుడు వీళ్ల ప్రేమకు ప్రతీకగా ఇద్దరు కుమారులు పుట్టారు.

షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ ఆరంభించిన సుహాస్ ఆ తర్వాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదట కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించాడు. . ‘కలర్ ఫోటో’ మూవీతో హీరోగా మారి సక్సెస్ కొట్టాడు. రైటర్ పద్మభూషణ్, అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్, శ్రీరంగ నీతులు, ప్రసన్న వదనం, గొర్రె పురాణం, జనక అయితే గనక, ఉప్పుకప్పురంబు, ఓ భామ అయ్యోరామ తదితర సినిమాలతో కథానాయకుడిగా ఆకట్టుకున్నాడు. హిట్ 2, ఫ్యామిలీ డ్రామా వంటి సినిమాల్లో విలన్ గానూ మెప్పించాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు సహాయక నటుడిగా మెప్పిస్తున్నాడు సుహాస్. ఇటీవల విడుదలైన పవన్ కల్యాణ్ సినిమా ఓజీలోనూ ఓ క్యామియో రోల్ చేశాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. గన్ డీలర్ గా కొద్ది సేపు కనిపించి ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేశాడు. ప్రస్తుతం సుహాస్, తెలుగులో రెండు తమిళంలో ఓ సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఇవి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

భార్య, కుమారుడితో హీరో సుహాస్..

 

View this post on Instagram

 

A post shared by Suhas (@suhassssssss)

ఓజీ సినిమా సెట్ లో సుహాస్..

 

View this post on Instagram

 

A post shared by Suhas (@suhassssssss)

 

View this post on Instagram

 

A post shared by Suhas (@suhassssssss)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.