
టాలీవుడ్ లో తక్కువ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఆమె. ఆమె అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోల సరసన నటించింది. ఒకప్పుడు అత్యధిక పారితోషికం తీసుకున్న తారలలో ఆమె ఒకరు. విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు హిందీలో వరుస సినిమాలతో అలరిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు వయసు 50 సంవత్సరాలు. అయినప్పటికీ పెళ్లికి దూరంగా ఉంటూ సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. అంతేకాకుండా ఆంటీ రోల్స్ అస్సలు చేయను.. హీరోయిన్ గానే నటిస్తానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అలాగే ఇండస్ట్రీలో రాణించాలంటే.. బాయ్ ఫ్రెండైనా ఉండాలి..బ్యాగ్రౌండ్ ఐనా ఉండాలి అంటుంది.
ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?
ఈ స్టార్ హీరో అమ్రీష్ పురి మనవడా..! బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్నాడుగా
ఆమె మరెవరో కాదుఅమిషా పటేల్. ఒకప్పుడు హోమ్లీగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు గ్లామర్ షోతో రచ్చ చేస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఈ మూవీలో అందం, అభినయంతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ మూవీ ఘన విజయం సాధించడంతోపాటు అమీషాకు తెలుగులో పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత మహేష్ బాబు జోడిగా నాని చిత్రంలోనూ మెరిసింది. అంతేకాకుండా ఎన్టీఆర్ సరసన నటించింది. తెలుగుతోపాటు బాలీవుడ్ లోనూ వరుస అవకాశాలు అందుకుంది. కానీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసినప్పటికీ ఈ బ్యూటీకి సరైన బ్రేక్ మాత్రం రాలేదు.
ఫస్ట్ నైట్‌ను వీడియో తీసుకున్న భర్త.. కట్ చేస్తే ట్విస్ట్.. అప్పుడే అసలు సినిమా మొదలు.. ఎక్కడ చూడొచ్చంటే
దీంతో కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను టాప్ హీరోయిన్ అవ్వకపోవడానికి కారణం చెప్పింది. తన మనస్తత్వం కారణంగా తనను ఎక్కువ మంది ముఖ్యంగా సినిమా ప్రరిశ్రమవాళ్లు ఇష్టపడరు అని తెలిపింది. ఇండస్ట్రీలో రాణించాలంటే పెద్ద వారిని ఇంప్రస్ చేయాలి. నాకు దురలవాట్లు లేవు. మందు తాగను, సిగిరెట్ త్రాగను లేదా పని కావాలని కాకాపట్టను దాంతో నాకు పెద్దగా ఆఫర్స్ రాలేదు. అయినా సరే నేను లొంగిపోను. నాకు వచ్చిన అవకాశాలు వదులుకోకుండా సినిమాలు చేస్తున్నాను. అలాగే ఇండస్ట్రీలో సన్నిహితుడో, బాయ్ ఫ్రెండో లేనప్పుడు ఒంటరిగా అందులో ఇమడడం చాలా కష్టం.
చిరంజీవి, పవన్ కళ్యాణ్‌కు లవర్‌గా రామ్ చరణ్‌కు తల్లిగా.. ఈ హీరోయిన్ రూటే సపరేటు
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.