
ఘజియాబాద్‌లోని ట్రోనికా సిటీలో ఇద్దరు నిందితులు ఉన్నట్లు ఉత్తర్‌ప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్, ఢిల్లీ పోలీసుల సంయుక్త బృందం గుర్తించింది. వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారు మృతి చెందారు. వారిని రవీంద్ర, అరుణ్‌గా పోలీసులు గుర్తించారు. ఇద్దరూ రోహిత్ గోదారా-గోల్డీ బ్రార్ ముఠా సభ్యులని చెప్పారు. ఘటనాస్థలం నుంచి తుపాకులు, పెద్దమొత్తంలో బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా దిశా సోదరి ఖుష్బూ పటానీ వ్యాఖ్యలు చేయడంతో కాల్పుల ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు తామే బాధ్యులమని గోల్డీ బ్రార్ గ్యాంగ్ ప్రకటించుకుంది. మాజీ ఆర్మీ అధికారిణి అయిన ఖుష్బూ పటానీ ప్రస్తుతం ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరా తీశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తమకు హామీ ఇచ్చినట్లు దిశా తండ్రి మీడియాకు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :