Most Recent

మరీ ఇలా ఉన్నవేంటయ్యా..! టాస్క్‌లో దుమ్ముదులిపిన భరణి.. దెబ్బకు పర్మినెంట్ ఓనర్

మరీ ఇలా ఉన్నవేంటయ్యా..! టాస్క్‌లో దుమ్ముదులిపిన భరణి.. దెబ్బకు పర్మినెంట్ ఓనర్

బిగ్ బాస్ సీజన్ 9లో మొదటి వారం ఎలిమినేష్ జరిగిపోయింది. అందరూ అనుకున్నట్టే శ్రష్టి వర్మ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు.. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన శ్రష్టి వర్మ ఆట పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అలాగే ఓటింగ్‌లోనూ ఈ చిన్నదనికి అంతా ఆదరణ దక్కలేదు. దాంతో మొదటివారమే శ్రష్టి వర్మ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. అంతకు ముందు ఏం జరిగిందంటే ఇక నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున శనివారం మిగిలిన వారికి క్లాస్ తీసుకున్నారు. బాక్స్ బద్దలు కొడతా అంటూ మరికొంతమంది హౌస్ మేట్స్ కు క్లాస్ తీసుకున్నారు నాగ్. ఇక నిన్నటి ఎపిసోడ్ లో మర్యాద మనీష్, ప్రియ ఇద్దరికీ గట్టిగానే పడింది. శ్రష్టి వర్మ ఆపిల్ అడిగితే ఇవ్వలేని మీరు రాము రాథోడ్‌కి అరటిపళ్లు ఎలా ఇచ్చారు.? అంటూ నాగార్జున అడగ్గానే ప్రియా లేదు సార్ మర్చిపోయా అని చెప్పింది. దాంతో నువ్వు డాక్టర్ వి కదా మతిమరుపును మందులు వేసుకో అని నాగ్ అన్నారు.

ఇక నిన్న ఆదివారం కావడంతో మిరాయ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తేజ సజ్జ, రితిక నాయక్ బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు. తేజ సజ్జ, రితిక  ఇద్దరూ హౌస్ మేట్స్ తో గేమ్స్ ఆడారు, డాన్స్ చేయించారు. ఆతర్వాత నాగార్జున హౌస్ మేట్స్ కు ఓ టాస్క్ ఇచ్చారు. టెనెంట్స్ నుంచి ఒకరు పర్మినెంట్ ఓనర్ అయ్యేందుకు టాస్క్ ఇచ్చారు నాగ్. టెనెంట్స్ 9 మందిని రెండు టీములుగా చేసిన బిగ్ బాస్.. టీమ్ లో సంచలక్ గా ఉండే వ్యక్తి ఓనర్ అయ్యే ఛాన్స్ మిస్ అవుతారు అని చెప్పాడు. రెడ్ టీమ్‌లో భరణి, రాము రాథోడ్, శ్రష్టి వర్మ, తనూజ అలాగే బ్లూ టీమ్‌లో సంజన, ఇమ్మానుయేల్, రీతూ చౌదరి, సుమన్ శెట్టి ఉన్నారు. మిగిలిపోయిన ఫ్లోరా షైనీని సంచలక్ చేశారు.

కన్వేయర్ బెల్టు నుంచి వచ్చే పేపర్స్ తీసుకొని దాని పై స్పష్టంగా స్టాంప్ వేసి అక్కడ వారికి కేటాయించిన బ్యాలెట్ బాక్స్ లో వేయాలి అని బిగ్ బాస్ చెప్పారు. ఒకరు పేపర్లు తీసుకోవాలి, ఒకరు స్టాంప్ వేయాలి, ఇంకొకరు బాక్స్ లో వేయాలి అని చెప్పాడు. అలాగే ఒక టీమ్ మరొక టీమ్ సభ్యులను ఆపే ప్రయత్నం చేయొచ్చు అని చెప్పాడు బిగ్ బాస్ దాంతో హౌస్ మేట్స్ రెచ్చిపోయారు. బజార్ మోగగానే బ్లూ టీమ్ పై విరుచుకుపడ్డాడు భరణి. రీతూ చౌదరి, ఇమ్మానుయేల్ లను కదలకుండా ఉడుం పట్టుపట్టాడు. బ్లూ టీమ్ లో ఉన్న సంజన ఓ తప్పు చేసింది. బాక్స్ లో పేపర్లు పూర్తిగా వేయకుండా పైకి కనిపించేలా వేసింది. దాంతో రెడ్ టీమ్ లోని తనూజ ఆ పేపర్లను తీసి బయట పడేసింది. దాంతో చివరిగా రెడ్ టీమ్ విన్ అయ్యింది. దాంతో రెడ్ టీమ్ నుంచి ఒకరు పర్మినెంట్ ఓనర్ అయ్యే ఛాన్స్ ఉందంటూ నాగార్జున అనౌన్స్ చేశారు. ఎవరు ఓనర్ అవ్వాలి అనేది బ్లూ టీమ్, అలాగే సంచలక్ నిర్ణయిస్తారు అని చెప్పాడు. సంచలక్ గా ఉన్న ఫ్లోరా శ్రష్టి వర్మ పేరు చెప్పగా.. బ్లూ టీమ్ ఇమ్మానుయేల్, సంజన, రీతూ చౌదరి, సుమన్ శెట్టి మాత్రం భరణికి ఓటు వేశారు. దాంతో భరణి పర్మినెంట్ ఓనర్ అయ్యాడు. భరణికి ఓ పవర్ ఇచ్చాడు నాగ్  అసిస్టెంట్‌గా ఒకరిని పెట్టుకోవాలని చెప్పాడు. దాంతో అసిస్టెంట్‌గా తనుజను ఎంచుకున్నాడు భరణి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  ఇక్కడ క్లిక్‌ చేయండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.