Most Recent

Bigg Boss 9 Elimination: బిగ్‌బాస్‌ 9 ఫస్ట్‌వీక్‌.. తొలి ఎలిమినేటర్‌ ఎవరంటే..?

Bigg Boss 9 Elimination: బిగ్‌బాస్‌ 9 ఫస్ట్‌వీక్‌.. తొలి ఎలిమినేటర్‌ ఎవరంటే..?

రియాలిటీ షో బిగ్‌బాస్‌ సీజన్‌ 9 మొదటి వారం పూర్తి చేసుకుంది. హీరో నాగార్జున హోస్ట్‌గా 9వ సీజన్‌ గత ఆదివారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి వారం పూర్తి కావడంతో తొలి ఎలిమినేషన్‌ ప్రక్రియ కూడా మొదలైంది. ఫస్ట్‌ ఎలిమినేషన్‌లో భాగంగా కొరియోగ్రాఫర్‌ శ్రష్టి వర్మ హౌస్‌ నుంచి బయటకు వచ్చారు. సో.. బిగ్‌బాస్‌ సీజన్‌ 9లో తొలి ఎలిమినేటర్‌గా ఆమె నిలిచారు. నిజానికి శ్రష్టి కాకుండా మరో లేడీ కంటెస్టెంట్‌ ఎలిమినేట్‌ అవుతారని చాలా మంది భావించారు. కానీ షాకింగ్‌గా శ్రష్టి ఎలిమినేట్‌ అయ్యారు.

అయితే తనతో సహా అందరూ బయట ఉన్నప్పుడు మాస్క్‌ తో ఉంటారని, ఇలాంటి షోలలోనే అసలు స్వరూపం తెలుస్తుందని శ్రష్టి బిగ్‌బాస్‌లోకి వెళ్లేటప్పుడు చెప్పిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఒకట్రెండు వారాలు నటించడం సులభమే కానీ, ఆ తర్వాత కుదరదని కూడా పేర్కొంది. సెలబ్రెటీలతో పాటు ఈసారి సామాన్యులకూ అధిక ప్రాధాన్యం కల్పించడంతో ఈ కొత్త సీజన్‌ ప్రత్యేకంగా నిలిచింది. తొమ్మిది మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్స్‌ షోలో అడుగుపెట్టారు. నామినేషన్స్‌లో సంజన, తనూజ సేవ్‌ అయ్యారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  ఇక్కడ క్లిక్‌ చేయండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.