Most Recent

Bigg Boss 9: నా రియాక్షన్ కూడా చూపిస్తా.. ఓకే ఓకే చాలా చూశాం..! హౌస్‌లో హరీష్, ఇమ్మానుయేల్ రచ్చ..

Bigg Boss 9: నా రియాక్షన్ కూడా చూపిస్తా.. ఓకే ఓకే చాలా చూశాం..! హౌస్‌లో హరీష్, ఇమ్మానుయేల్ రచ్చ..

బిగ్ బాస్ మొదటి రోజే రచ్చ రచ్చగా సాగింది. హరీష్ దెబ్బకు హౌస్ లో కొన్ని గొడవలు జరిగాయి. హౌస్ లో ఉన్నవారిని గార్డెన్ ఏరియాకు పిలిచినా బిగ్ బాస్ ఓనర్లు , టెనెంట్స్ ను సపరేట్ గా కూర్చోబెట్టాడు. ఇంతలో ఇమ్మానుయేల్ ను గార్డెన్ ఏరియా క్లిన్ చేయడానికి ఎంత సమయం పడుతుంది అని అడిగాడు బిగ్ బాస్.. కష్టంగా ఉంది బిగ్ బాస్ ఒక రోజు మొత్తం పడుతుంది అని చెప్పాడు ఇమ్మానుయేల్. అయితే ఎంత సమయం పడుతుందో మీ మానిటర్ ఆంట్ హరీష్ నిర్ణయిస్తాడు అని చెప్పారు బిగ్ బాస్. దాంతో గుండు అంకుల్ కొంచం చూడండి అంటూ సరదాగా కామెంట్ చేశాడు ఇమ్మానుయేల్.. మొదటి దాన్ని పెద్దగా పట్టించుకోని హరీష్ .. రెండు మూడు ఇమ్మానుయేల్ గుండు అంకుల్ అనడంతో సీరియస్ అయ్యాడు హరీష్. చూసుకోని మాట్లాడాలి బ్రదర్.. ఎవరు గుండు.? ఎవరు అంకుల్.? అంటూ ఫైర్ అయ్యాడు.

అన్నా సారీ చెప్పాను కదన్నా.. ఇమ్మానుయేల్ అంటే దానికి హరీష్ కూడా బాడీ షేమింగ్ వరకూ వెళ్లొద్దు అని సీరియస్ అయ్యాడు. దాంతో ఇమ్మానుయేల్ కూడా మాట పెంచాడు. దాంతో కొద్దిసేపు ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. మీ మూడ్ బట్టి మనుషులు ఉండరు అని ఇమ్మానుయేల్ అన్నాడు.. ఆతర్వాత ఓకే ఓకే చాలా చూశాం.. అని హరీష్ డైలాగ్ వేశాడు. నా రియాక్షన్ కూడా చూపిస్తా అని ఇమ్మానుయేల్ సవాల్ విసిరాడు. గుండు అంకుల్ అని అంటే బాగోదు.. మీరు ఎక్కడి వరకైనా తీసుకెళ్లండి.. నేను చూసుకుంటా ఇలా ఇద్దరి మధ్య చాలా సేపు మాటల యుద్ధం జరిగింది.

ఆతర్వాత హరీష్ ను పక్కకు తీసుకెళ్లి  ఇమ్మూ-శ్రష్టి కూల్ చేశారు. నేను కావాలని అలా పిలవలేదు.. బాడీ షేమింగ్ ఉద్దేశం నాకు లేదని ఇమ్మానుయేల్ చెప్పగానే దానికి హరీష్ డైలాగ్ వేశాడు. నాకు నచ్చితే నేను గుండెల్లో పెట్టుకుంటా నా నెత్తిన ఎక్కాలని చూస్తే మాత్రం తొక్కుతా అంటూ హరీష్ డైలాగ్ కొట్టాడు. ఇలా నిన్నటి ఎపిసోడ్ లో హరీష్ చాలా కంటెంట్ ఇచ్చాడు. ఇక నామినేషన్స్ లోనూ మనోడికి ఎక్కువ పడే ఛాన్స్ కనిపిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.