Most Recent

Bigg Boss 9 : క్లీన్ చెయ్యరు.. చెయ్యనివ్వను..! ఓనర్లు అంతా ఒకవైపు హరీష్ ఓవైపు

Bigg Boss 9 : క్లీన్ చెయ్యరు.. చెయ్యనివ్వను..! ఓనర్లు అంతా ఒకవైపు హరీష్ ఓవైపు

బిగ్ బాస్ మొదటి ఎపిసోడే రసవత్తరంగా సాగింది. మొదటి రోజే హౌస్ మేట్స్ మధ్య మాటల యుద్ధం జరిగింది. హరీష్ ఇమ్మానుయేల్ మధ్య చిన్న పాటి గొడవే జరిగింది. హౌస్ లోకి ఐదుగురు కామానర్లు తొమ్మిది మంది సెలబ్రెటీలు అడుగుపెట్టిన విషయం తెలిసిందే.. ఇక డే వన్ లో జరిగిన సంఘటనలు ఒక్కసారి చూద్దాం.! ఉదయాన్నే రా మచ్చా మచ్చా సాంగ్ తో హౌస్ మేట్స్ ను నిద్ర లేపారు. ఈ పాటకు హౌస్ లో ఉన్న డాన్సర్స్ స్టెప్పులేశారు. కామనర్లు హౌస్ ఓనర్స్ అన్న విషయం తెలిసిందే.. అయితే ఓనర్స్ టెనెంట్స్ కు ఒక ఆఫర్ ఇచ్చారు మీరు మమ్మల్ని ఇంప్రెస్ చేస్తే హౌస్ లోకి వచ్చే అవకాశం ఇస్తాం, నచ్చిన ఫుడ్ తినొచ్చని చెప్పారు. దానికి బిగ్ బాస్ స్పందిస్తూ.. హౌస్ ఓనర్లది అని మర్చిపోయారా అని కామనార్లకు గుర్తు చేశారు.

మాఫియా డాన్‌తో కలిసి అరెస్ట్.. చేతులారా కెరీర్ నాశనం చేసుకున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?

ఓనర్స్ కొంతమంది టెనెంట్స్ కు కొన్ని పనులు అప్పగించారు. ఇప్పుడు ఓనర్స్ మానిటర్లుగా మారి టెనెంట్స్ చేసే పనులు గమనించాలని చెప్పాడు బిగ్ బాస్. అలాగే ఇచ్చిన పనికి సంబంధించిన బ్యాడ్జ్ లను కూడా వారికి పెట్టాలని బిగ్ బాస్ ఆదేశించాడు. హౌస్ క్లీనింగ్ శ్రష్టి, ఇమ్మానుయేల్‌కి అప్పగించాడు హరీష్. అలాగే తనూజ, భరణిలకి కుకింగ్ అప్పగించింది ప్రియా.. అయితే తనూజ, భరణిలు కేవలం వంట మాత్రమే చేస్తారని.. వంటగది క్లీన్ చెయ్యరు, చేయనివ్వను అని చెప్పింది ప్రియా. దాంతో హరీష్ ప్రియతో వాదనకు దిగాడు. మధ్యలో మనీష్ మాట్లాడుతుంటే అతనిపై కూడా గొడవకు దిగాడు హరీష్. దాంతో ఓనర్లు అందరూ ఒక్కటై హరీష్ గురించి చర్చించుకున్నారు.

Bigg Boss 9 : బిగ్ బాస్ హౌస్‌లోకి ఈ ఇద్దరూ అమ్మాయిలు.. సామాన్యుల కోటాలో ఎంట్రీ

ఆతర్వాత పని అంత అయిపోయిందని అందరూ తింటుండగా బిగ్ బాస్ మరో షాక్ ఇచ్చాడు. ఇల్లు ఓనర్లది టెనెంట్స్ బయటకు వెళ్లిపోండి అని చెప్పాడు. తింటున్న ఫుడ్ కూడా వదిలేసి వెళ్ళిపోవాలి అని బిగ్ బాస్ ఆదేశించాడు. అయితే హరీష్ కెమెరా ముందుకు వెళ్లి ఇమ్మానుయేల్ చాలా కష్టపడ్డాడు అతన్ని తిననివ్వండి అని రిక్వెస్ట్ చేశాడు. కానీ బిగ్ బాస్ రెస్పాండ్ అవ్వలేదు. ఆతర్వాత హరీష్ దగ్గరున్న ఫుడ్ కూడా స్టోర్ రూమ్ లో పెట్టమని చెప్పాడు. దాంతో హరీష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆతర్వాత అందరిని గార్డెన్ ఏరియాలోకి పిలిచి ఫుడ్ ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు బిగ్ బాస్. ఎవరికీ ఇచ్చిన ఫుడ్ వల్లే తినాలి అని చెప్పాడు బిగ్ బాస్ దాంతో ఓనర్లు ఓ వైపు, కామనార్లు ఓ వైపు కూర్చున్నారు.

ఒకరు స్టార్ హీరో, మరొకరు పెద్ద దర్శకుడు..! ఈ ఫొటోలో వెంకీమామతో పాటు ఉన్నదిఎవరో గుర్తుపట్టారా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.