Most Recent

War 2 Movie: హృతిక్, ఎన్టీఆర్ కాదు.. వార్2 సినిమాలో మెయిన్ విలన్‌ ఇతడేనట.. ట్విస్ట్ ఇచ్చిన మేకర్స్

War 2 Movie: హృతిక్, ఎన్టీఆర్ కాదు.. వార్2 సినిమాలో మెయిన్ విలన్‌ ఇతడేనట.. ట్విస్ట్ ఇచ్చిన మేకర్స్

సుమారు రూ. 400 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ‘వార్ 2’ సినిమా కోసం మూవీ లవర్స్ మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆశగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. హృతిక్ రోషన్‌తో కలిసి అతను స్క్రీన్‌ను షేర్ చేసుకున్నారు. అయితే వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ నెగెటివ్ రోల్ లో నటించాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై చిత్ర బృందం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇంతలో ‘వార్ 2’ టీమ్‌లో మరో స్టార్ ఆర్టిస్ట్ చేరాడని తెలుస్తోంది. ‘యానిమల్’ సినిమాలో విలన్ గా నటించిన తర్వాత బాబీ డియోల్ కు డిమాండ్ బాగా పెరిగింది. ఇప్పుడతను హిందీతో పాటు దక్షిణాది సినిమాల్లోనూ విలన్ గా యాక్ట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘వార్ 2’ సినిమాలో కూడా బాబీ డియోలే మెయిన్ విలన్ గా కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. అభిమానులు కూడా బాబీని యాక్షన్ అవతారంలో చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

‘వార్ 2’ ఆగస్టు 14న విడుదల కానుంది. అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఇప్పటికే జోరుగా జరుగుతున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక రోజు ముందు విడుదలవుతున్న ఈ సినిమా కు పాజిటివ్ రివ్యూలు వస్తే వారాంతంలో భారీ మొత్తంలో వసూళ్లు సాధిస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. ‘వార్ 2’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నెగటివ్ రోల్ పోషించే అవకాశం ఉందని కొందరు ఊహిస్తున్నారు. అది నిజమో కాదో సినిమా విడుదలైన తర్వాతే తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు. ‘జనాబ్-ఎ-ఆలీ’ పాట ప్రోమో ఇప్పటికే వైరల్ అయింది.

‘యష్ రాజ్ ఫిల్మ్స్’ ‘వార్ 2’ చిత్రాన్ని నిర్మించింది. దీనికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ‘వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్’ నుంచి వచ్చిన టైగర్ (సల్మాన్ ఖాన్), పఠాన్ (షారుఖ్ ఖాన్) పాత్రలు ‘వార్ 2’ చిత్రంలో కనిపించవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఆగస్టు 14న వీటన్నింటికీ సమాధానం దొరుకుతుంది.

 వార్ 2 సినిమాలో ఎన్టీఆర్, హృతిక్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.