
గతంలో సిల్వర్ స్క్రీన్ పై స్టార్స్ గా కనిపించిన వారిలో చాలా మంది ఇప్పుడు ఆధ్యాత్మిక భావనలో మునిగి తేలుతున్నారు. సెలబ్రెటీ హూదా, లగ్జరీ లైఫ్ ను విడిచి పెట్టి ప్రశాంతమైన జీవితాన్ని పొందేందుకు సన్యాసులుగా మారుతున్నారు. బర్ఖా మదన్, సోఫియా హయత్, గ్రేసీ సింగ్.. లాంటి ఎందరో అందాల తారలు ఇప్పుడు సాధ్విలుగా మారి సింపుల్ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ఈ అందాల తార కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఒకప్పుడు వెండితెర, బుల్లితెరపై స్టార్ నటిగా రాణించిన ఆమె ఇప్పుడు సన్యాసినిగా మారిపోయారు. దేవాలయాల వద్ద ఆమె భిక్షాటన కనిపిస్తున్నారు. ఆమెకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ అందాల తార మరెవరో కాదు నూపూర్ అలంకార్. పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు కానీ.. ఒకప్పుడు టెలివిజన్ రంగంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన శక్తిమాన్ సీరియల్ లో నూపుర్ పాత్రను ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. ఇదే కాదు , ఘర్ కీ లక్ష్మీ బేటియా, తంత్ర వంటి టీవీ సీరియల్స్ లో నటించి మెప్పించిందీ అందాల తార. పలు సినిమాల్లోనూ నటించి వెండితెరపై కూడా అలరించింది. అయితే ఉన్నట్లుండి 2022లో నుపుర్ సినిమా ప్రపంచాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మిక మార్గాన్ని స్వీకరించింది. ఆమె ఇప్పుడు సన్యాసినిగా జీవితాన్ని గడుపుతోంది. గత మూడు సంవత్సరాలలో, తన జీవితంలో చాలా పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయంటోంది నుపుర్. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు పాల్గొన్న ఆమె సాధ్విగా మారిన తర్వాత తన జీవితం ఎలా మారిపోయిందో ఇలా చెప్పుకొచ్చింది.
‘నేను అన్ని కోరికలను త్యజించి సన్యాసినిగా మారాలని నిర్ణయించుకున్నప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. నా వ్యక్తిగత సమస్యల నుండచి తప్పించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుంటుందని భావించారు. కానీ అందులో ఎలాంటి నిజాలు లేవు. ఈ మూడు సంవత్సరాలు నేను పూర్తిగా దేవునికి అంకితం చేయబడ్డాను. నా జీవితం ఒక తీర్థయాత్ర స్థలం నుంచి మరొక తీర్థయాత్రకు ప్రయాణించడం, ధ్యానం చేయడం, దేవుని నామాన్ని జపించడంలో గడిచిపోతుంది. నేను సినిమా ఇండస్ట్రీలో అన్నీ అనుభవించాను. నేను సాధించాలనుకున్నది సాధించాను. నేను కలవాలనుకున్న ప్రతి ఒక్కరినీ కలిశాను. కానీ ఇప్పుడు నా మనసు తేలికగా ఉంది. . ఎందుకంటే ఇప్పుడు నేను ధ్యానంలో మునిగిపోయాను. అందరితో సంబంధాలు తెగిపోయాయి’
సాధ్వి అయిన తర్వాత తన రోజువారీ ఖర్చులను ఎలా? అని నూపుర్‌ను అడగ్గా.. ఆమె ఇలా సమాధానం ఇచ్చింది, “నేను సెలబ్రిటీగా ఉన్నప్పుడు చాలా బిల్లులు చెల్లించాల్సి వచ్చింది. జీవనశైలి, దుస్తులకు ఖర్చులు ఉండేవి. నేను ఆహారం గురించి ఆందోళన చెందాను. ఇప్పుడు నేను నా నెలవారీ ఖర్చులను పది నుండి ఇరవై వేలతో తీర్చుకోగలుగుతున్నాను. భిక్షాటన చేసిన తర్వాత అందులో కొంత మొత్తం దేవునికి సమర్పిస్తాను. ఇది నా అహాన్ని నాశనం చేస్తుంది. నా దగ్గర నాలుగు నుంచి ఐదు జతల బట్టలు మాత్రమే ఉన్నాయి. నేను గుహలలో, అడవులలో, ఎత్తైన పర్వతాలలో కూడా నివసించాను. నేను గడ్డకట్టే చలిలో సైతం రోజుల పాటు ఉన్నాను. తీవ్రమైన తపస్సు కారణంగా నా శరీరం బలహీనపడింది. ఇప్పుడు నేను సేవకురాలిని. నా విధులను నెరవేర్చడానికి తిరిగి వచ్చాను. ఇప్పుడు నేను ప్రజలకు ఆధ్యాత్మికత గురించి మార్గనిర్దేశం చేస్తాను’ అని అంటోంది నుపుర్.
నుపుల్ అలంకార్.. అప్పుడు.. ఇప్పుడు..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..