
సినిమా రంగుల ప్రపంచంలో ప్రతి సంవత్సరం కొత్త హీరోయిన్స్ వస్తుంటారు. కొందరు ఫస్ట్ మూవీతోనే స్టార్ డమ్ సంపాదించుకుంటారు. మరికొందరికి వరుస సినిమాలు చేసినప్పటికీ గుర్తింపు రాదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ మాత్రం తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. తెలుగులో అగ్ర హీరోలతో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తూ జనాలకు దగ్గరయ్యింది. ఆనతి కాలంలోనే టాప్ హీరోలతో వరుస సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యింది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలకు దూరమయ్యింది. ఇప్పుడు నెల జీతం కోసం ఐటీ జాబ్ చేస్తుంది. ఇంతకీ ఈ అమ్మడు గుర్తుందా.. ? అదేనండి.. వేదం సినిమాలో అల్లు అర్జున్ రిచ్ గర్ల్ ఫ్రెండ్ గా కనిపించిన దీక్షా సేత్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన రెబల్ మూవీలో నటించింది.
ఇవి కూడా చదవండి : Actress : ఒకప్పుడు తోపు హీరోయిన్.. ఇప్పుడు 5 కంపెనీలకు యజమాని.. రూ.2000 కోట్ల ఆస్తులు.. ఎవరంటే..
తెలుగులో వేదం సినిమాతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ప్రభాస్ జోడిగా రెబల్, గోపిచంద్ సరసన వాంటెడ్, రవితేజతో కలిసి నిప్పు, మిరపకాయ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. తక్కువ సమయంలోనే తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. చివరగా 2012లో ఊ కొడతార.. ఉలిక్కిపడతారా సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. తెలుగులో ఆఫర్స్ తగ్గిపోవడంతో బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. అక్కడ కూడా ఆశించినంతగా ఆఫర్స్ రాలేదు. దీంతో సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది.
ఇవి కూడా చదవండి : Cinema : 26 రోజుల్లోనే 280 కోట్ల కలెక్షన్స్.. రికార్డ్ సృష్టించిన తొలి యానిమేటెడ్ సినిమా ఇది..
లండన్ వెళ్లిపోయిన దీక్షా సేత్.. ఇప్పుడు అక్కడే ఐటీ జాబ్ చేస్తూ సెటిల్ అయ్యింది. తెలుగు, కన్నడ, హిందీ భాషలలో పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఈ అమ్మడు.. ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఐటీ ఉద్యోగం చేస్తూ లైఫ్ లీడ్ చేస్తుంది. లండన్ లో సొంతంగా ఇల్లు కొనుక్కున్న ఈ వయ్యారి.. అటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడు.. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ మాత్రం అస్సలు మారలేదు. ఇప్పటికీ గ్లామర్ ఫోజులతో నెట్టింట రచ్చ చేస్తుంది.
ఇవి కూడా చదవండి : Cinema : రెండు గంటల సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ.. దెబ్బకు దద్దరిల్లిన బాక్సాఫీస్.. ఎక్కడ చూడొచ్చంటే..
View this post on Instagram
Cinema: రూ.70 లక్షల బడ్జెట్.. 70 కోట్ల కలెక్షన్స్.. 460 రోజులు థియేటర్లలో రచ్చ చేసిన సినిమా..