
ప్రస్తుతం సోషల్ మీడియాలో టాలీవుడ్ క్రేజీ హీరో త్రోబ్యాక్ ఫోటో తెగ వైరలవుతుంది. పైన ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి ఎత్తుకున్న చిన్నోడు ఎవరో తెలుసా.. ? ఇప్పుడు తెలుగు సినిమా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో అతడు. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అంతేకాదు.. త్వరలోనే తండ్రిగా ప్రమోషన్ సైతం పొందనున్నాడు. ఆగస్ట్ 22న చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయనతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ చిరుకు బర్త్ డే విషెస్ చెప్పాడు. ఇంతకీ పైన ఫోటోలో కనిపిస్తున్న కుర్రాడు ఎవరో తెలుసా.. ? అతడే మెగా హీరో వరుణ్ తేజ్. మెగాస్టార్ చిరంజీవి ఎత్తుకున్న ఫోటోను చేస్తూ పెద్దనాన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు వరుణ్. ప్రస్తుతం ఈ త్రోబ్యాక్ ఫోటో నెట్టింట తెగ వైరలవుతుంది.
ఇవి కూడా చదవండి : Actress : ఒకప్పుడు తోపు హీరోయిన్.. ఇప్పుడు 5 కంపెనీలకు యజమాని.. రూ.2000 కోట్ల ఆస్తులు.. ఎవరంటే..
వరుణ్ తేజ్.. ఇప్పుడు తెలుగు సినిమా ప్రపంచంలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ముకుంద సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్.. ఆతర్వాత ఫిదా సినిమాతో హిట్టు అందుకున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా వరుస సినిమాలతో అలరిస్తున్నాడు. లవర్ బాయ్ గా, మాస్ యాక్షన్ హీరోగానూ మెప్పిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి : Cinema : 26 రోజుల్లోనే 280 కోట్ల కలెక్షన్స్.. రికార్డ్ సృష్టించిన తొలి యానిమేటెడ్ సినిమా ఇది..
ఇటీవలే మట్కా సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. కానీ ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం కొత్త సినిమా చిత్రీకరణో బిజీగా ఉన్నాడు. టాలీవుడ్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠిని వరుణ్ తేజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులు త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందనున్నారు.
ఇవి కూడా చదవండి : Cinema : రెండు గంటల సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ.. దెబ్బకు దద్దరిల్లిన బాక్సాఫీస్.. ఎక్కడ చూడొచ్చంటే..
View this post on Instagram
Cinema: రూ.70 లక్షల బడ్జెట్.. 70 కోట్ల కలెక్షన్స్.. 460 రోజులు థియేటర్లలో రచ్చ చేసిన సినిమా..