Most Recent

Tollywood: 7 ఏళ్లకే మంగళం పల్లి చేతుల మీదుగా అవార్డు.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

Tollywood: 7 ఏళ్లకే మంగళం పల్లి చేతుల మీదుగా అవార్డు.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

పై ఫొటోను చూశారా? అందులో ఉన్న ఇద్దరిలో ఒకరు స్వర సంగీత సార్వభౌముడైన మంగళం పల్లి బాలమురళీ కృష్ణను ఈజీగా గుర్తు పట్టేస్తారు. అందులో కన్ఫ్యూజన్ ఏమీ లేదు. మరి అలాంటి దిగ్గజం చేతుల మీదుగా అవార్డు అందుకుంటోన్న ఆ పాపను గుర్తు పట్టారా? ఆ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. చిన్నప్పటి నుంచే నృత్యంపై ఆసక్తి పెంచుకుంది. కూచిపుడి, భరత నాట్యం వంటి క్లాసికల్ డ్యాన్స్ లో శిక్షణ తీసుకుంది. పలు నృత్య పోటీల్లో పాల్గొని బహుమతులు కూడా గెల్చుకుంది. ఈ క్రమంలోనే ఏడేళ్ల వయసులోనే సంగీత దిగ్గజం మంగళం పల్లి బాలమురళీ కృష్ణ చేతుల మీదుగా అవార్డు కూడా అందుకుంది. ఓ వైపు చదువు కొనసాగిస్తూనే పలు కల్చరల్ ఈవెంట్స్, ప్రోగ్రామ్స్ లో పాల్గొంది. ఏటా హైదరాబాద్ లో జరిగే కార్తీక దీపోత్సవంలోనూ సందడి చేసింది. అందులో శివుడి వేషధారణలో కనిపించి ఆహూతులను అలరించింది. తన డ్యాన్స్ వీడియోలు అప్పట్లో నెట్టింట తెగ వైరలయ్యాయి. ఇదే క్రమంలో షార్ట్ ఫిల్మ్స్ తో సినిమా కెరీర్ ఆరంభించింది. ఆ తర్వాత హీరోయిన్ గా సినిమాల్లోనూ ఛాన్స్ దక్కించుకుంది. ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మ మూడు సినిమాల్లో నటించింది.అయితేనేం తన అందం, అభినయంతో చాలామందికి ఫేవరెట్ గా మారిపోయింది

అన్నట్లు ఈ ముద్దుగుమ్మ డాక్టర్ గా కూడా విధులు నిర్వహిస్తోంది. ఎంబీబీఎస్ తర్వాత లండన్‌లో MD (డాక్టర్ ఆఫ్ మెడిసిన్) కూడా పూర్తి చేసిన ఆమె కోవిడ్ కాలంలో ఫ్రంట్ లైన్ వారియర్ గా సేవలు కూడా అందించింది. మరి ఈ బ్యటీ ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు ఆ మధ్యన ప్రియదర్శితో కలిసి సారంగపాణి జాతకం సినిమాలో నటించిన హీరోయిన్ రూపా కొడువాయూర్.

రూపా కొడువాయూర్ లేటెస్ట్ ఫొటోస్..

 

View this post on Instagram

 

A post shared by Roopa Koduvayur (@roopakoduvayur_9)

2020లో రిలీజైన ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో తెలుగు ప్రేక్షకులకు రూపా కొడువాయూర్.. అంతకు ముందు ఫౌజి అనే ఓ తెలుగు షార్ట్ ఫిల్మ్ లోనూ యాక్ట్ చేసింది. ఇక 2023లో బిగ్ బాస్ ఫేమ్ సొహైల్‌ ఖాన్ తో కలిసి మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాలో కథానాయికగా నటించింది. సారంగపాణి జాతకం సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది.

 

View this post on Instagram

 

A post shared by Roopa Koduvayur (@roopakoduvayur_9)

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ రూపా కొడువాయూర్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తను పోస్ట్ చేసే ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Roopa Koduvayur (@roopakoduvayur_9)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.