
హీరోయిన్స్ లైఫ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నిత్యం షూటింగ్స్ తో బిజీగా ఉండే హీరోయిన్స్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి అస్సలు సమయం దొరకదు. కొంతమంది భామలు షూటింగ్ కు ఏమాత్రం గ్యాప్ దొరికిన వెంటనే ఫ్యామిలీతో గడపడానికి సొంత ఊరికి చెక్కేస్తారు. మరికొంతమంది వెకేషన్స్ అంటూ షికారు చేస్తుంటారు. ఇక పెళ్ళైన హీరోయిన్స్ కూడా తమ ఫ్యామిలీతో టైం గడపడానికే చేస్తారు. కానీ సినిమా షూటింగ్స్ కారణంగా నెలల తరబడి వారు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో తన భార్య తన దగ్గర లేనందుకు ఒంటరి తనాన్ని భరించలేకపోతున్నా అంటూ ఓ హీరోయిన్ భర్త ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.?
పిచ్చిలేపిందిగా.! కిక్ సినిమాలో ఇలియానా చెల్లి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
టాలీవుడ్ ప్రముఖ నటి పూర్ణ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిందీ అందాల తార. శ్రీ మహాలక్ష్మి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది పూర్ణ. సీమ టపాకాయ్, అవును తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గానే కాకుండా దసరా, అఖండ, గుంటూరు కారం, డెవిల్ తదితర సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ పోషించింది. అలాగే పలు టీవీ షోల్లోనూ మెరిసింది.
105 కేజీల బరువు పెరిగా.. పిచ్చిపిచ్చిగా ట్రోల్ చేశారు.. హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
సినిమాలు, టీవీ షోల సంగతి పక్కన పెడతే దుబాయ్ కు చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీతో పెళ్లి పీటలెక్కంది పూర్ణ. 2022 జూన్ 12న దుబాయిలోనే తన పెళ్లి జరిగినట్లు ఒక సందర్భంలో చెప్పుకొచ్చింది పూర్ణ. 2023 ఏప్రిల్‌లో హమ్దాన్ అసిఫ్ అలీ అనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది పూర్ణ. ఇదిలా ఉంటే పూర్ణ షూటింగ్స్ లో బిజీగా ఉండటంతో ఆమె భర్త ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ఈ 45 రోజుల్లో నాకు ప్రేమ గొప్పదనం ఏంటో తెలిసొచ్చింది. మనల్ని ప్రేమించేవారు మనతో ఉండటమే జీవితంలో అన్నిటికంటే గొప్ప వరం అని నాకు అర్ధమైంది. ఈరోజు నా భార్య నా దగ్గరకు తిరిగొచ్చేసింది. ఎన్నో ఎదురుచూపుల తర్వాత నా భార్యను కలవడంతో నాకు ఆనందభాష్పాలు వస్తున్నాయి అంటూ రాసుకొచ్చారు. అయితే ఈ పోస్ట్ ను కొంతమంది తప్పుగా తీసుకున్నారు. వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయని అనుకున్నారు. దీని పై ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు. నా భార్య 20 రోజులు చెన్నైలో, 15 రోజులు మలప్పురంలో, ఆ తర్వాత జైలర్ 2 మూవీ కోసం అక్కడ తనింట్లో ఉంది. అంటే మొత్తం 45 రోజులు నాకు దూరంగా ఉంది. పెళ్ళైన ఇన్నేళ్ళలో మేము ఎప్పుడూ ఇంత దూరంగా లేము అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు.
బాప్ రే బాప్..! ఈమె ప్రేమిస్తే సినిమా హీరోయినా..? ఎంత మారిపోయింది..!!
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.