
దీపం ఉండగానే ఇల్లు చక్క చెట్టుకోవాలన్న మాటను సినిమా సెలబ్రిటీలు బాగా ఆచరిస్తున్నారు. అందుకే ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్ రంగంలోకి అడుగు పెడుతున్నారు. సమంత, రష్మిక మందన్నా, అలియా భట్, దీపికా పదుకొణె, మహేష్ బాబు, అల్లు అర్జున్, నాగ చైతన్య… ఇలా ఎందరో స్టార్ సెలబ్రిటీలు వివిధ వ్యాపారాల్లో రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే నటుడు, బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా కూడా రెస్టారెంట్ బిజినెస్ నిర్వహిస్తున్నాడు. గతంలో సినిమాలు, సీరియల్స్ తో బిజీగా ఉండే అలీ రెజా ఇప్పుడు ఎక్కువగా కనిపించడం లేదు. సోషల్ మీడియాలోనూ సందడి చేయడం లేదు. ఇదే విషయంపై అలీ రెజా క్లోజ్ ఫ్రెండ్ యాంకర్ రవి
ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. ‘ అలీ రెజా ముంబైలో రెస్టారెంట్ బిజినెస్ రన్ చేస్తున్నాడు. ఇప్పుడు అతను అక్కడే బిజీ అయిపోయాడు. ఇప్పుడు పెద్దగా కలవట్లేదు. ఒకప్పుడు మా ఫ్యామిలీలు రెగ్యులర్ గా కలిసే వాళ్లం. నా కూతురు, అలీ రెజా కూతురు చాలా క్లోజ్’ అని చెప్పుకొచ్చాడు యాంకర్ రవి.
అలీ రెజా ముంబైలో మరొకరితో కలిసి అఫ్జల్స్ మావో అనే రెస్టారెంట్ ని స్థాపించాడు. ముంబైలో ఈ రెస్టారెంట్ కు సంబంధించి 5 బ్రాంచెస్ కూడా రన్ అవుతన్నాయి. ఇటీవలే ఫుడ్ కి సంబంధించిన అవార్డులు కూడా అలీ రెజా రెస్టారెంట్ కు వరించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు అలీ రెజా.
View this post on Instagram
గాయకుడు, ధ్రువ, సినీ మహల్, మెట్రో కథలు, వైల్డ్ డాగ్, రంగ మార్తాండ, సీఎస్ఐ సనాతన్, మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా, మామా మశ్చీంద్ర, జాక్, బ్లైండ్ స్పాట్ తదితర హిట్ సినిమాల్లో నటించాడు అలీ రెజా. అలాగే పసుపు కుంకుమ, ఎవరే నువ్వు మోహినీ, మాటే మంత్రము తదితర సూపర్ హిట్ సీరియల్స్ తో బుల్లితెర ఆడియెన్స్ కు కూడా బాగా చేరువయ్యాడు. ఇక బిగ్ బాస్ 3లో కంటెస్టెంట్ గానూ మరింత క్రేజ్ సొంతం చేసుకున్నాడు.
భార్యా పిల్లలతో అలీ రెజా..
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.