Most Recent

Adivi Sesh: వీధి కుక్కలపై సుప్రీం సంచలన ఆదేశాలు.. సీజేఐకి లేఖ రాసిన టాలీవుడ్ హీరో అడివి శేష్

Adivi Sesh: వీధి కుక్కలపై సుప్రీం సంచలన ఆదేశాలు.. సీజేఐకి లేఖ రాసిన టాలీవుడ్ హీరో అడివి శేష్

దేశ రాజధాని ఢిల్లీతో పాటు చుట్టు పక్కల ప్రధాన నగరాలైన నోయిడా, గురుగ్రామ్‌, గజియాబాద్‌ వీధుల్లో ఒక్క కుక్క కూడా ఉండకూడదంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. వెంటనే వీధి కుక్కలన్నింటినీ షెల్టర్లకు తరలించాలని ఈ ఆదేశాల్లో పేర్కొంది సుప్రీం. అయితే సుప్రీం ఇచ్చిన ఈ ఆదేశాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జంతు ప్రేమికులతో పాటు పలువురు సినీ ప్రముఖులు దీనిని ఖండిస్తున్నారు. వీధి కుక్కల పట్ల వెలువరించిన ఆదేశాలను పునఃపరిశీలించాలని కోరుతూ లేఖలు రాస్తున్నారు. ఈ క్రమంలోనే వీధి కుక్కల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ టాలీవుడ్‌ హీరో అడివి శేషు సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కి లేఖ రాశారు.

‘చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, ఢిల్లీలో వీధి కుక్కలను సామూహికంగా నిర్బంధించాలన్న ఆదేశం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇది మన చట్టపరమైన బాధ్యతలకు, భారతదేశం ఎప్పటినుంచో పాటిస్తున్న కారుణ్య విలువలకు విరుద్ధం. వీధి కుక్కలు మన సమాజంలో ఒక భాగం. వాటిని శత్రువులుగా చూడటం సరికాదు. ఈ ఆదేశాల వల్ల నిరపరాధమైన ప్రాణాలకు హాని కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతున్నాను. టీకాలు వేసి, స్టెరిలైజేషన్ చేసిన కుక్కలు ప్రమాదకరం కాదు. వాటికి గౌరవంగా జీవించే హక్కు ఈ సమాజంలో ఉంది. వాటిని నిర్బంధించడం అనేది సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు, అదొక తాత్కాలిక ప్రతిచర్య మాత్రమే. ఇటువంటి చర్యలకు బదులుగా శాస్త్రీయమైన, మానవతా దృక్పథంతో కూడిన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి’

ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి.. అంతే కానీ.. ఇలా సామూహికంగా..’..

‘స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ కార్యక్రమాలను ముమ్మరం చేయాలి. జంతువులపై క్రూరత్వాన్ని అరికట్టేందుకు కఠినమైన జరిమానాలు విధించాలి. ఇలాంటి చర్యల ద్వారా మనుషులు, జంతువుల భద్రతను ఒకేసారి కాపాడవచ్చు. ఇప్పటికే ఉన్న జంతు సంక్షేమ చట్టాలకు అనుగుణంగా, టీకాలు వేసిన శునకాలను వాటి ప్రాంతాల్లోనే ఉండనివ్వాలి. ఈ సమస్యకు మానవతా దృక్పథంతో పరిష్కారం కనుగొంటారని ఆశిస్తున్నాను’ అని అడివి శేష్ తన లేఖలో కోరారు.

రాహుల్ , మేనకా గాంధీలతో పాటు సినీ ప్రముఖుల ఆందోళన..

కాగా ఇదే విషయంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ, నటులు జాన్‌ అబ్రహం, వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ తదితరులు స్పందించారు. సుప్రీం ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. మరి వీటిపై సుప్రీం ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.