
హారర్ సినిమాలు చూడడం అంటే మీకు ఇష్టమా.. ? అయితే ఇప్పుడు మీరు ఈ సైకాలాజికల్ థ్రిల్లర్ సినిమా గురించి తెలుసుకోవాల్సిందే. భయాంకరమైన సినిమా.. ఆద్యంతం మిమ్మల్ని కట్టిపడేస్తుంది. కనికరంలేని హంతకుడు పోలీసులతో మైండ్ గేమ్ ఆడుతుంటాడు. ఆ సమయంలో భయం దావానంలా వ్యాపిస్తుంది.. ఇద్దరు వ్యక్తులు మనసులను అత్యంత క్రూరంగా హతమారుస్తుంటారు. ఆ సినిమా పేరు ఇరైవన్. ఈ తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీకి అహ్మాద్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 28, 2023న విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. న్యాయం, గాయం, అత్యంత తెలివైన వ్యక్తి మనస్తత్వం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.
ఇవి కూడా చదవండి: Dulquer Salman: ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక.. దుల్కర్ సల్మాన్..
కథ విషయానికి వస్తే.. ఈ సినిమా మొత్తం అసిస్టెంట్ కమిషనర్ అర్జున్ పాత్ర చుట్టూ ఉంటుంది. ఇందులో అర్జున్ పాత్రలో కోలీవుడ్ హీరో జయం రవి నటించారు. ఎన్నో ఎన్ కౌంటర్స్ చేసిన పోలీస్ ఆఫీసర్. నిజాయితీకి మారుపేరుగా ఉంటారు. ఇందులో బ్రహ్మా (రాహుల్ బోస్) అనే సీరియల్ కిల్లర్ వరుస హత్యలు చేస్తుంటాడు. అతడిని కేవలం స్మైలీ ఫేస్ నోట్స్ తో మాత్రమే గుర్తుపడతారు. దర్యాప్తు సమయంలో అర్జున్ స్నేహితుడు, సహోద్యోగి ఆండ్రూ హత్యకు గురవుతాడు. దీంతో అర్జున్ రాజీనామా చేసి ఆండ్రూ సోదరి ప్రియ (నయనతార)తో కలిసి వెళ్లిపోతారు. కానీ నగరంలో వరుస హత్యలు మాత్రం జనాలను భయాన్ని పుట్టిస్తాయి. కానీ అర్జున్ తన స్నేహితుడి మరణానికి న్యాయం చేయాలని తిరిగి విధుల్లోకి వచ్చి సీరియల్ కిల్లర్ కోసం వేట ప్రారంభిస్తాడు. ఆ తర్వాత అర్జున్ జీవితంలో ఏం జరిగింది.. ? అనేది సినిమా. ఈ సినిమా ఆద్యంతం మీకు వణుకు పుట్టిస్తుంది.
ఇవి కూడా చదవండి: Actor: అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?
ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 22.5 కోట్ల వసూల్లు రాబట్టింది. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాను కేవలం 4 కోట్లతో నిర్మించారు. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇవి కూడా చదవండి: Actress : ఈ క్రేజ్ ఏంట్రా బాబూ.. 40 ఏళ్లు దాటిన తగ్గని జోరు.. 50 సెకండ్స్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్..
ఇవి కూడా చదవండి: అరాచకం భయ్యా.. వయ్యారాలతో గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ..