
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, దివంగత నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నం కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు( ఆగస్టు 30 ) తెల్లవారుజామున కన్నుమూశారు. అల్లు కనకరత్నంగారి వయస్సు 94. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ సినిమా పనుల్లో ముంబైలో ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే ముంబై నుండి బయలు దేరాడు అల్లు అర్జున్. ఈరోజు మధ్యాహ్నం కోకాపేటలో అల్లు కనకరత్నంగారి అంత్యక్రియలు జరగనున్నాయి. అల్లు అరవింద్ తల్లి కన్నుమూయడంతో సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. సినీ ప్రముఖులు అల్లు కనకరత్నం మృతికి సంతాపం తెలుపుతున్నారు.
అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. అల్లు అరవింద్ పలు సినిమాలు నిర్మిస్తున్నారు. బడా సినిమాలతో పాటు చిన్న చిన్న సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు అల్లు అరవింద్.