
బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో ఈసారి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు నిర్వాహకులు. సెలబ్రిటీలతో పాటు సామాన్య జనాలకు కూడా ఈ రియాలిటీ షోలో పాల్గొనే సువర్ణావకాశం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే బిగ్‌బాస్ అగ్నిపరీక్ష అంటూ సరికొత్త కాంటెస్ట్ ను ప్రకటించారు. ఇందుకోసం సుమారు 20 వేల మంది దరఖాస్తు చేసుకోగ దశలవారీగా వారిని ఫిల్టర్ చేసి చివరకు 45 మందిని ఎంపిక చేశారు. వీరికి అగ్నిపరీక్ష అనే కార్యక్రమంలో రకరకాల టాస్కులు పెట్టి అందులో కేవలం ఐదుగురిని బిగ్‌బాస్ 9వ సీజన్ కు ఎంపిక చేయనున్నారు. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆ అయిదుగురు కంటెస్టెంట్లు ఎవరో కూడా తెలిసిపోయింది. బిగ్ బాస్ సీజన్ 9 కు ఎంపికైన కంటెస్టెంట్లలో మాస్క్ మ్యాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇతని పేరు హరీష్ అట. అగ్ని పరీక్షలో భాగంగా ఇచ్చిన టాస్కులన్నింటినీ ఈజీగా కంప్లీట్ చేశాడట మాస్క్ మ్యాన్. కొన్ని టాస్కుల్లో ఇతని స్పీడ్ ని చూసి జడ్జీలు కూడా ఆశ్చర్యపోయారట. కాబట్టి ఇతను బిగ్ బాస్ 9 లోకి కంటెస్టెంట్ గా అడుగు పెడితే ఫన్ అదిరిపోతుందని బిగ్ బాస్ యాజమాన్యం భావించిందట. అందుకే చూడడానికి ఎంతో ఫన్నీ గా కనిపించే ఈ మనిషిని బిగ్ బాస్ కంటెస్టెంట్ గా సెలెక్ట్ చేశారట.
అయితే బిగ్ బాస్ హౌస్ రాణించాలంటే ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉండాలి. కానీ ఈ మాస్క్ మ్యాన్ లో అదేమీ లేదని తెలుస్తోంది. పైగా హౌస్ లోకి ఎంటరయ్యాక తోటి కంటెస్టెంట్స అందరితోనూ కలిసిపోవాల్సి ఉంది. గ్రూప్ టాస్కులు కూడా ఆడాల్సి ఉంటుంది. అయితే ఈ మాస్క్ మ్యాన్ లో ఆ కలివిడితనం లేదు. పైగా ఇతను షో మొత్తం మాస్క్ పెట్టుకొనే కనిపిస్తాడట. మరి దీనిని బిగ్ బాస్ ఆడియెన్స్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
బిగ్ బాస్ అగ్ని పరీక్ష లేటెస్ట్ ప్రోమో..
View this post on Instagram
మాస్క్ మ్యాన్ తో పాటు శ్వేతా శెట్టి, ప్రియా శెట్టి, దివ్యాంగుడు ప్రసన్న కుమార్, ఆర్మీ జవాన్ శ్రీధర్ లు కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వీరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.