
ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీతారల త్రోబ్యాక్ పిక్చర్స్ తెగ వైరలవుతున్నాయి. సినిమా హీరోహీరోయిన్స్ నుంచి సీరియల్ సెలబ్రెటీస్ వరకు ప్రతి ఒక్కరి చిన్ననాటి ఫోటోస్ ఇప్పుడు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పైన ఫోటోను చూశారు కదా.. ఈ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా..? బుల్లితెరపై చాలా ఫేమస్. తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని నటుడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినీరంగంలోకి అడుగుపెట్టాడు. మొదట్లో మిమిక్రీ ఆర్టిస్టుగా అవకాశాలు అందుకున్నాడు. చాలా కాలం పాటు సరైన అవకాశం కోసం ఎదురుచూశాడు. తన కామెడీ టైమింగ్ తో టీవీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు వెండితెరపై నటుడిగా రాణిస్తున్నాడు. ఇంతకీ ఆ నటుడు ఎవరో గుర్తుపట్టారా. ? ఆ కుర్రాడు మరెవరో కాదండి.. జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్.
ఇవి కూడా చదవండి.. OTT Movie: బాబోయ్.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న థ్రిల్లర్ సినిమాలు.. ఊహకు అందని ట్విస్టులు..
జబర్దస్త్ కమెడియన్ గా బుల్లితెరపై పాపులర్ అయ్యారు రాకింగ్ రాకేష్. నటనపై ఆసక్తిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు. కానీ టీవీలో వచ్చిన జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫేమస్ అయ్యాడు. ఈ షోలో తన కామెడీ టైమింగ్ తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇన్నాళ్లు బుల్లితెరపై పలు రియాల్టీ షోలలో కామెడీతో అలరించిన రాకేష్.. ఇటీవలే హీరోగా వెండితెరపై కనిపించారు. రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన సినిమా కేశవ చంద్ర రమావత్. గ్రీన్ టీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. అన్నన్య క్రిష్ణన్ కథానాయికగా నటించింది. ఈ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు రాకేష్.
ఇవి కూడా చదవండి.. Megastar Chiranjeevi: చిరంజీవికి ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా, చెల్లిగా నటించిన హీరోయిన్..
ఇక పర్సనల్ విషయానికి వస్తే.. జబర్దస్త్ కామెడీ షో చేస్తున్న సమయంలోనే యాంకర్ సుజాతతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు పాప జన్మించింది. తాజాగా నటుడిగా ఈటీవీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేశారు రాకేష్.
ఇవి కూడా చదవండి.. ఒక్క యాడ్‌తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?
View this post on Instagram
Actress: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా.. సెకండ్ ఇన్నింగ్స్‌లో అందాల రచ్చ..