
ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న స్టైలీష్ విలన్ అతడు. తెలుగు, హిందీ, తమిళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రలలో కనిపించి మెప్పించాడు. పవర్ ఫుల్ విలన్ గా ఎన్నో చిత్రాల్లో నటించి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇంజనీరింగ్ వదలి నటనపై ఆసక్తితో సినిమాల్లోకి అడుగుపెట్టారు. ఇంతకీ ఈ నటుడు ఎవరో తెలుసా.. ? అతడు మరెవరో కాదు.. నటుడు సోనూసూద్. జూలై 30 ఆయన పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఎంతో మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నటుడి భార్య కూడా ఒక ప్రసిద్ధ నిర్మాత.
ఇవి కూడా చదవండి.. ఒక్క యాడ్‌తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?
సోను సూద్ విలన్ పాత్రలతోనే ఫేమస్ అయ్యాడు. కానీ నిజ జీవితంలో మాత్రం హీరో కంటే తక్కువ కాదు. కరోనా కాలంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ సమయంలో ఎంతోమందికి సాయం అందించారు. సోషల్ మీడియాలోనూ అనేక మంది పేదలకు సహాయం అందిస్తూనే ఉన్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన సోను సూద్ సినిమాల్లోకి రావాలనుకున్నారు. నటనపై ఆసక్తితో దక్షిణ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టాడు. 2005లో వచ్చిన ‘ఆషిక్ బనాయా ఆప్నే’ సినిమాతో హిందీ సినీరంగంలోకి అడుగుపెట్టాడు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగులో అరుంధతి సినిమాతో మరింత పాపులర్ అయ్యారు.
ఇవి కూడా చదవండి. Actress: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా.. సెకండ్ ఇన్నింగ్స్‌లో అందాల రచ్చ..
సోను సూద్ 1996లో సోనాలిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. సోనాలి బాలీవుడ్ గ్లామర్‌కు దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. వీరిద్దరు కలిసి నాగ్‌పూర్‌లో ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు స్నేహితులు. కొన్నాళ్లపాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.
View this post on Instagram
Actress : గ్లామర్ ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. అందాలు ఫుల్లు.. ఆఫర్స్ నిల్లు..