
విజయ్ దేవరకొండ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం కింగ్ డమ్. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్రం ఎట్టకేలకు గురువారం (జులై 31) న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మళ్లీ రావా, జెర్సీ వంటి ఫీల్ గుడ్ సినిమాలను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి తన శైలికి భిన్నంగా మొదటి సారిగా ఓ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించాడు. ఈ మూవీలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. సత్యదేవ్ మరో కీలక పాత్ర పోషించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు స్వరాలందించాడు. కాగా ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో దుమ్ములేపుతుంది. బుక్ మై షోలో ఇప్పటి వరకు లక్ష టికెట్స్ సేల్ అయ్యాయి. అలాగే ఓవర్సీస్‌లోనూ హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడు పోతున్నాయి. ఈ నేపథ్యంలో కింగ్ డమ్ సినిమాలో నటించిన ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్ల పారితోషికం వివరాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఎవరెవరు ఎంత తీసుకున్నారనే విషయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
కాగా కింగ్ డమ్ సినిమా కోసం విజయ్ దేవరకొండ తన కెరీర్‌లోనే హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాక్. ఈ చిత్రానికి గానూ అతను ముప్పై కోట్లు పారితోషికంగా అందుకుంటున్నట్లు సమాచారం. అయితే ఇందులో కొంత లాభాల్లో షేర్ రూపంలో తీసుకోనున్నాడని తెలుస్తోంది. ఇక విజయ్ తర్వాత దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి ఏడు కోట్లు, సత్య దేవ్‌కి మూడు కోట్లు, అనిరుధ్ రవిచందర్‌కి పది కోట్లు, హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే కి కోటి, ఇతర కాస్టింగ్‌కి రెండు కోట్లు, టెక్నీషియన్లకి ఏడున్నర కోట్ల వరకు అయినట్టు తెలుస్తోంది. అంటే ఈ లెక్కన కింగ్ డమ్ సినిమాకు సుమారు అరవై కోట్ల వరకు పారితోషికాలే అయినట్టు సమాచారం. ఓవరాల్ గా ఈ సినిమాను రూ. 130 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారని సమాచారం. అయితే ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.
ఫుల్ జోష్ లో కింగ్ డమ్ సినిమా ప్రమోషన్లు..
Everything they do to give you a moment of euphoria, a smile, a scream, a burst of energy, a high.
We all felt it
And after that, you know…
it’s all Yela Hela Hela Heeyyy Laaaa…#KingdomOnJuly31st@TheDeverakonda x @anirudhofficial pic.twitter.com/b0y7tp8D7R
— Sithara Entertainments (@SitharaEnts) July 29, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి