
బరువు తగ్గించుకోవడంలో భాగంగా చాలా మంది ఉపవాసం పాటిస్తుంటారు. కొన్ని గంటల పాటు నోరు కట్టేసుకుని ఉంటారు. ముఖ్యంగా సినిమా తారల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతుంటుంది. స్లిమ్ గా, నాజుకూగా కనిపించేందుకు కచ్చితంగా డైట్ పాటిస్తుంటారు. అలాగే కఠినమైన వర్కౌట్లు కూడా చేస్తుంటారు. అయితే ఈ హీరోయిన్ మాత్రం నెక్ట్స్ లెవల్. ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఏకధాటిగా తొమ్మిది రోజులు ఏమీ తినకుండా ఉంటుందట. కేవలం నీళ్లతోనే కడుపు నింపుకొంటుందట. అయితే ఏడాదిలో కేవలం రెండు సార్లు మాత్రమే ఇలా చేస్తుందట. ఈ విషయాన్ని ఆమెనే ఇటీవల స్వయంగా వెల్లడించింది. ఇంతకి కఠినమైన్ ఉపవాసం పాటిస్తోన్న ఆ హీరోయిన్ ఎవరునుకుంటున్నారా? తను మరెవరో కాదు బ్యూటీ నర్గీస్ ఫక్రి. పవన్ కల్యాణ్ నటిస్తోన్న హరి హర వీరమల్లు సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మ నటించిందని తెలుస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన నర్గీస్ ఫక్రి తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అలాగే తన డైట్ సీక్రెట్స్ గురించి కూడా వెల్లడించింది.
దయచేసి ఎవరూ నా సలహాను పాటించొద్దు..
‘ నేను తొమ్మిది రోజులపాటు కేవలం నీళ్లు తాగే బతుకుతాను. ఇది చాలా కష్టంగా ఉంటుంది. ఇలా 9 రోజులు పూర్తయ్యే సరికి ముఖం చాలా వికృతంగా మారుతుంది. కళ్లు, బుగ్గలు లోపలకు వెళ్లిపోయి, దవడ బయటకు వచ్చినట్లు కనిపిస్తుంది. ఫేస్ లో మాత్రం కాస్త గ్లో కనిపిస్తుంటుంది. అయితే ఇది పాటించమని నేనెవరికీ సలహా ఇవ్వను . ఉదాహరణకు మంచి నిద్ర కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. నేనైతే రోజూ ఎనిమిది గంటలు నిద్రపోతాను. అలాగే తరచూ నీళ్లు తాగుతూ ఉంటాను. విటమిన్స్, మినరల్స్ తదతర మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాను’ అని నర్గీస్ ఫక్రి చెప్పుకొచ్చింది.
నర్గీస్ ఫక్రి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
2011లో రాక్ స్టార్ సినిమాతో నర్గీస్ ఫక్రి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మే తేరా హీరో, హౌస్‌ఫుల్ 3, టొర్బాజ్, అజర్, మద్రాస్ కేఫ్, అమవాస్ వంటి పలు చిత్రాల్లో నటించింది. కానీ స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేకపోయింది. ఇటీవల హౌస్‌ఫుల్ 5 సినిమాలోనూ తళుక్కుమందీ అందాల తార.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.