
ప్రస్తుతం తెలుగు సినీరంగంలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో అక్కినేని నాగచైతన్య ఒకరు. జోష్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన చైతూ.. ఇటీవలే తండేల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటించింది. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి చైతూ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. దీంతో ఇప్పుడు చైతూ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి నెలకొంది. ఇన్నాళ్లు లవ్ స్టోరీ చిత్రాలతో అలరించిన చైతూ.. ఇప్పుడు పీరియాడికల్ డ్రామాతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఇదిలా ఉంటే.. చైతూ గతంలో తన ఫస్ట్ ఎవరనే విషయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే.
గతంలో లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్లలో సైతం చైతూ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. భవిష్యత్తులో హిందీలో ఎవరితో పనిచేయాలని ఉందని యాంకర్ ప్రశ్నించగా.. చైతూ స్పందిస్తూ.. తన ఫస్ట్ క్రష్ మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ అని.. ఇదే విషయాన్ని ఆమెను కలిసినప్పుడు సైతం చెప్పానని అన్నారు. అలాగే అలియా భట్ యాక్టింగ్ అంటే ఇష్టమని.. ఆమెతో సినిమా చేసే ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోనని అన్నారు. అలాగే ప్రియాంక చోప్రా, కరీనా కపూర్, కత్రినా కైఫ్ హీరోయిన్లతో నటించాలని ఉందని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి :
అలాగే ఆటోబయోగ్రఫీ రాయాల్సి వస్తే.. దానికి ఏం టైటిల్ పెడతారు అని అడగ్గా..”జీవితాన్ని అంత సీరియస్ గా తీసుకోవద్దు” అనే టైటిల్ పెడతానని.. ఏదైనా ఐలాండ్ లో చిక్కుకుపోతే తనకు ఇష్టమైన మ్యూజిక్ ఉండాలనుకుంటానని.. అలాగే తన మనసుకు నచ్చిన మహిళతో సరదాగా మాట్లాడుకుంటూ ఉండిపోతానని అన్నారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..