
స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కు టాలీవుడ్ లోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇటీవల ఆయన సినిమాలు తెలుగులోనూ మంచి విజయాలను అందుకుంటున్నాయి. అలాగే టాలీవుడ్ దర్శకులతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు దుల్కర్. హనూ రాఘవపూడి తో సీతారామం లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ మలయాళ హీరో.. ఇటీవలే లక్కీ భాస్కర్ సినిమాతో మరో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. గతేడాది దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ సంగీతం అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ సినిమా పాన్ ఇండియాలో సూపర్ డూపర్ హిట్ అయింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రానుందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు వెంకీ అట్లూరి పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో వెంకీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ క్రమంలోనే లక్కీ భాస్కర్ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చాడు. అనుకున్నట్టుగా లక్కీ భాస్కర్ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని ఫిక్స్ అయ్యాను.. ఇప్పుడు ప్రేక్షకులు కూడా సీక్వెల్ చేయాలని ప్రేక్షకుల నుంచి కూడా డిమాండ్ వస్తుంది.
కాబట్టి ‘లక్కీ భాస్కర్’ సీక్వెల్ ఉంటుంది. కానీ దానికి కొంచెం టైమ్ పడుతుంది. లక్కీ భాస్కర్ సినిమా తర్వాత బయోపిక్ సినిమాలు చేయాలని కొంతమంది అన్నారు. కానీ వాటిని తెరకెక్కించాలని నాకు లేదు.. థ్రిల్లర్,పీరియాడిక్ చిత్రాలు చేయాలని కూడా లేదు. కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమాలు చేస్తాను. అందుకు అనుగుణంగా ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నా.. అని చెప్పుకొచ్చాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ప్రస్తుతం సూర్య ఓ సినిమా చేస్తున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.