
సాధారణంగా 60 ఏళ్లకు దగ్గరైన వారు ఎక్కువగా ఇంటికే పరిమితమవుతారు. వృద్ధాప్య సమస్యలు, మోకాళ్ల నొప్పులంటూ పెద్దగా బయట తిరగరు. చిన్న చిన్న పనులకు కూడా వేరొకరి సాయం తీసుకుంటుంటారు. అదే సమయంలో కొందరు మాత్రం 60 ఏళ్ల వయసులోనూ సాహసాలు చేస్తుంటారు. యువకులకు కూడా సాధ్యం కానీ పనులు సైతం చేస్తూ అందరి చేత ఔరా అనిపించుకుంటారు. ఇలాంటి వీరి దృష్టిలో ఏజ్ జస్ట్ ఒక నంబర్ మాత్రమే. ఈ స్టార్ నటుడు కూడా సరిగ్గా ఇదే జాబితాకు చెందుతాడు. 59 ఏళ్ల ఈ నటుడు ముంబయి నుంచి గోవా వరకు సుమారు 600 కిలోమీటర్ల దూరం మోటారు వాహనం లేకుండా ప్రయాణించారు. కేవలం 5 రోజుల్లోనే ఈ ప్రయణం పూర్తి చేసిన వ్యక్తిగా అరుదైన ఘనత సాధించాడు. ఈ ప్రయాణంలో భాగంగా ప్రతిరోజూ సుమారు 90కిమీ సైక్లింగ్, 21కిమీ పరుగు.. ఇలా విభజించుకుంటూ నటుడు ప్రయాణించాడు. గత నెల అంటే జూన్ 26న ముంబైలోని శివాజీ పార్క్ నుంచి ఈ పరుగు ప్రారంభమైంది. మహారాష్ట్ర భూభాగానికి ఆనుకుని ఉన్న కొంకణ్ బెల్ట్‌ను పూర్తిగా కవర్ చేస్తూ పెన్, కొలాడ్, చిప్లూన్, రత్నగిరి, కంకవళి ల మీదుగా ప్రయాణిస్తూ జూన్ 30న గోవాకు చేరుకున్నాడు. ఈ క్రమంలో తన సాహస ప్రయాణాన్ని తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడీ స్టార్ నటుడు. అందులో తను సైక్లింగ్, రన్నింగ్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు కూడా ఉన్నాయి. అవి ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసి సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఈ నటుడెవరో గుర్తు పట్టారా? అతను మరెవరో కాదు ఫిట్‌నెస్ ఐకాన్ గా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మిలింంద్ సోమన్.
‘ది ఫిట్ ఇండియా రన్’ పేరుతో ఏటా నిర్వహించే రన్నింగ్ ఈవెంట్ లో భాగంగా మిలింద్ సోమన్ ఈ సాహాస యాత్ర చేపట్టాడు.
ముంబయి నుంచి గోవా వరకు సుమారు 600 కిలోమీటర్ల దూరాన్ని 5 రోజుల్లో పూర్తి చేశాడు. ‘ఫిట్ ఇండియన్ రన్ లో భాగంగా 5 రోజుల పాటు 600కిమీ పూర్తి చేశాను. ఇది ఏటా తప్పనిసరిగా నేను ఎదుర్కొనే ఛాలెంజ్. ఇలాంటి ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేయడం నాకు ఉపకరిస్తుంది. అనేక మంది నాకు బెస్ట్ విషెస్ చెప్పడం మరెన్నో అఛీవ్ చేయాలని కోరుతుండడం నాకు మరింత స్ఫూర్తినిస్తుంది. ప్రతి భారతీయుడు ఫిట్ ఇండియన్ అవ్వాలి. జైహింద్’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు మిలింద్ సోమన్.
మిలింద్ సోమన్ వీడియో..
View this post on Instagram
కాగా బాలీవుడ్ లో స్టార్ నటుడిగా వెలుగొందుతోన్న మిలింద్ సోమన్ తెలుగులో ఒకే ఒక్క సినిమాలో నటించాడు. రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన సత్యమేవ జయతే సినిమాలో ఈ నటుడు ఓ కీలక పాత్ర పోషించాడు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..