
ఒకప్పుడు దక్షిణాదిలో తోపు హీరోయిన్. తెలుగుతోపాటు తమిళం, కన్నడ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది. రవితేజ, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి మెప్పించింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే తెలుగు సినిమాలు వదిలేసి బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అలరించిన ఈ అమ్మడు.. ఇప్పుడు మాత్రం మంచి ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంది. హిందీలో ఆమె నటించిన చిత్రాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి. దీంతో ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు రాలేదు. కానీ ఆమె క్రేజ్ మాత్రం వేరేలెవల్.. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా..? పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి ఇప్పుడు పాన్ ఇండియా క్రేజీ బ్యూటీ. ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ తాప్సీ పన్నూ.
2010లో ఝుమ్మంది నాథం సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ అమ్మడు.. ఆతర్వాత ధనుష్ సరసన ఆడుకలం సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగులో వరుస అవకాశాలు వచ్చినప్పటికీ తమిళంలో మాత్రం అంతగా ఆఫర్స్ అందుకోలేకపోయింది. తెలుగులో స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రభాస్ జోడిగా మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో మెరిసింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే బాలీవుడ్ షిప్ట్ అయిన ఈ అమ్మడు.. అక్కడ సైతం హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంది. చివరగా షారుఖ్ సరసన డుంకీ చిత్రంతో హిట్టుకొట్టిన ఈ బ్యూటీ.. ఇప్పటికీ మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు.
ఇదిలా ఉంటే.. 11 సంవత్సరాలు డేటింగ్ చేసిన తర్వాత తాప్సీ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయిస్‌ను కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకుంది. వీరిద్దరి పెళ్లి వేడుక ఉదయపూర్ లో జరిగింది. ప్రస్తుతం తాప్సీ ములాక్ 2, గాంధారి చిత్రాల్లో నటిస్తుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..