Most Recent

Shirish Reddy: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు దిల్ రాజు సోదరుడి లేఖ.. ఏమన్నారంటే?

Shirish Reddy: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు దిల్ రాజు సోదరుడి లేఖ.. ఏమన్నారంటే?

గేమ్ ఛేంజర్ సినిమా రిలీజై సుమారు ఆరు నెలలు కావొస్తోంది. అయినా ఇప్పటికీ మూవీ వార్తల్లో నిలుస్తోంది. తరచూ ఎవరో ఒకరూ సినిమాపై మాట్లాడి వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా దిల్ రాజు సోదరుడు గేమ్ ఛేంజర్ మూవీ రిజల్ట్ స్పందించారు. నితిన్ హీరోగా నటించిన తమ్ముడు సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన ఆయన గేమ్ ఛేంజర్‌ సినిమా తర్వాత రామ్ చరణ్‌ కానీ, డైరెక్టర్ శంకర్‌ కానీ కనీసం తమకు ఫోన్ కూడా చేయలేదన్నారు. వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి. సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ శిరీష్ రెడ్డిపై భగ్గుమంటున్నారు. దీనిపై ఇప్పటికీ దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. శిరీష్ మాటల వెనక అసలు ఉద్దేశమేమిటో వివరించారు. అయితే ఇప్పుడు స్వయంగా శిరీష్ రెడ్డి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. మేరకు ఆయన ఒక లేఖను విడుదల చేశారు.

అందరికీ నమస్కారం.. నేను ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలను సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అపార్థాలకు దారి తీసి.. దాని వలన కొందరు మెగా అభిమానులు బాధపడినట్లు తెలిసింది. గేమ్ ఛేంజర్ సినిమా కోసం మాకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన పూర్తి సమయం, సహకారం అందించారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి మాకు ఎన్నో ఏళ్ల నుంచి సాన్నిహిత్యం ఉంది. మేము చిరంజీవి, రామ్ చరణ్, అలాగే మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడం. ఒకవేళ నా మాటలు ఎవరి మనోభావాలను అయినా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే… క్షమించండి’ అని సోషల్ మీడియా వేదికగా శిరీష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మరి ప్రకటనతోనైనా మెగాభిమానులు కూల్ అవుతారేమో చూడాలి.

కాగా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన గేమ్ ఛేంజర్ సినిమా పెద్దగా ఆడలేదు. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. శంకర్ దర్శకత్వం వహించారు. కియారా అద్వానీ హీరోయిన్ గా  నటించింది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సినీ అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. అదే సమయంలో ఈ మూవీ రిజల్ట్ పై చాలామంది చాలా రకాలుగా వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.