
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగుమ్మలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఆకట్టుకుంటున్నారు. ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అలాంటి వారిలో ఈ చిన్నది ఒకరు. ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా స్టార్ హీరోల సినిమాల్లో రాణిస్తూనే ఛాన్స్ దొరికినప్పుడల్లా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి మెప్పిస్తుంది. అంతే కాదు తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. అలాగే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంది. అంతే కాదు ఏకంగా నేషనల్ అవార్డు కూడా అందుకుంది. ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టారా.? తాజాగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రెమ్యునరేషన్స్ గురించి ఆమె మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేసింది ఆ చిన్నది.
తాను రెమ్యునరేషన్ కు చివరి ప్రాధాన్యత ఇస్తా అని ముందు కథ, సినిమా గురించి మాత్రమే ఆలోచిస్తానని తెలిపింది. ఇంతకూ ఆమె ఎవరంటే .. తెలుగులో చాలా మంది అభిమాన తారగా మారింది కీర్తిసురేష్. తమిళ్ సినిమాల్లో హీరోయిన్ గా చేసిన ఆమె. ఆతర్వాత రామ్ పోతినేని నటించిన నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఆతర్వాత మహానటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మహానటి సినిమాకుగాను ఈ చిన్నది. నేషనల్ అవార్డు అందుకుంది.
ప్రస్తుతం ఈ అమ్మడు ఉప్పు కప్పురంబు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సుహాస్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో హీరోయిన్ కీర్తిసురేష్ మాట్లాడుతూ.. నేను ఎప్పుడూ పారితోషికానికి చివరి ప్రాధాన్యత ఇస్తాను. నాకు కథ చాలా ముఖ్యం. వైవిధ్యమైన పాత్రలు పోషించడమే నా లక్ష్యం. హీరోహీరోయిన్లకు సమాన రెమ్యూనరేషన్ విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఒక హీరో కోసం ప్రేక్షకులు ఎలా అయితే థియేటర్‌కు వస్తున్నారో అలానే ఓ హీరోయిన్ సినిమాకి ప్రేక్షకులు వస్తుంటే కచ్చితంగా ఆ హీరోయిన్ కు హీరోతో సమానంగా రెమ్యూనరేషన్ ఇవ్వొచ్చు అనేది నా అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చింది కీర్తిసురేష్. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.