
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా కుబేర. టాలీవుడ్ లో ఫీల్ గుడ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు ఉన్న శేఖర్ కమ్ముల ఈ ఎమోషనల్ డ్రామాను తెరకెక్కించాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాలతో జూన్ 20న విడుదలైన కుబేర సినిమా మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఓవరాల్ గా ఈ సినిమా రూ.120 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించిన కుబేర సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మల్టీ స్టారర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. కుబేర సినిమా స్ట్రీమింగ్ కు సంబంధించి ఇప్పటికే అమెజన్ ప్రైమ్ అధికారిక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో చెప్పినట్లుగానే నాగ్, ధనుష్ ల మూవీ శుక్రవారం (జులై 18) అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తెలుగుతో పాటు పలు భాషల్లోనూ ఈ బ్లాక్ బస్టర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా కుబేర సినిమాను నిర్మించారు. బాలీవుడ్ నటుడు జిమ్ సర్ఫ్ తో పాటు దలీప్ తహిల్, సాయాజీ షిండే, దివ్య దేకటే, హరీష్ పెరడి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇందులో బిక్షగాడిగా ధనుష్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అలాగే నాగ్ పాత్రకు కూడా మంచి పేరు వచ్చింది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్..
#Kuberaa is now streaming on Amazon Prime in Telugu, Tamil, Hindi, Malayalam & Kannada audios.
Ft. #Dhanush | #Nagarjuna | #RashmikaMandanna pic.twitter.com/EBPWertxfc
— OTT Gate (@OTTGate) July 17, 2025
డిలీటెడ్ సీన్స్ తో పాటు రష్మిక సాంగ్ కూడా !
@iamRashmika ‘s performance in Kubera is on par with Pushpa & Animal. Her character Length doesn’t matter, this small clip of her nuance performance shows her potential.
And of course @RagadiYT ‘s cameoworked well.#Rashmika #Kuberaa pic.twitter.com/VCq1nrZDy1
— Srivarsh (@Srivarsh3) July 11, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..